Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నట్టింట్లో తల్లి శవం.. ఆస్తుల కోసం కూతుళ్ల కొట్లాట!

  • సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన
  • బుధవారం మృతి చెందిన తల్లి
  • అంత్యక్రియలు మానేసి ఆస్తి పంపకాలపై గొడవ
  • పెద్దల జోక్యంతో నిన్న సాయంత్రానికి అంత్యక్రియలు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోమారు రుజువైంది. కన్నతల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం మానేసి ఆస్తుల కోసం కొట్టుకున్నారు కుమార్తెలు. చివరికి పెద్దల జోక్యంతో ఎప్పటికో ఆ తల్లికి అంత్యక్రియలు జరిగాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కోదాడకు చెందిన వెల్దినేని నాగమణి (80)కి ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఆ తర్వాతి కాలంలో పెళ్లిళ్లు చేసుకుని ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్‌లో  స్థిరపడ్డారు. నాగమణి భర్త తనువు చాలించడం, కోదాడలోని స్థలం విలువైనది కావడంతో దాని కోసం కుమార్తెల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 

అవి అలా కొనసాగుతుండగానే నాగమణి బుధవారం మరణించారు. చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించాలన్న స్పృహ కూడా లేకుండా కుమార్తెలు ఆమె మృతదేహాన్ని అలానే ఉంచి ఆస్తి పంపకాల కోసం గొడవ పడ్డారు. చివరికి పెద్దలు జోక్యం చేసుకొని రాజీ కుదర్చడంతో నిన్న సాయంత్రం తల్లికి దహన సంస్కారాలు  నిర్వహించారు.

Related posts

డల్లాస్, డెన్వర్‌లలో కాల్పులు.. 8 మంది మృతి

Drukpadam

యూపీలో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేత కాల్చివేత

Ram Narayana

తేలని వివేకా హత్యకేసు …కొనసాగుతున్న సిబిఐ విచారణ…

Drukpadam

Leave a Comment