Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సుంకిశాల ఎవరి పాపం …? డిప్యూటీ సీఎం భట్టి

సుంకిశాల ఎవరి పాపం …? డిప్యూటీ సీఎం భట్టి
సుంకిశాలపై విచారణ …దోషులను తేలుస్తాం
అడ్డగోలు ఆరోపణలపై భట్టి మండిపాటు

నిలువునా విరిగిపడిన సుంకిశాల గోడ అంటూ, కడుతున్న ప్రాజెక్టులో పెద్ద ప్రమాదం జరిగిందనేలా ఓ పత్రికలో వండి వార్చింది. అయితే ఇది ఎవరి పాపం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు ….గత ప్రభుత్వం ఒక్క మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజ్ లేకాదు క్రిష్ణా నదిపై నిర్మించిన అన్ని బ్యారేజీలు ఇదే విధంగా ఉన్నాయని భావించాల్సి వస్తుందని అన్నారు …అంటే రాష్ట్రం మొత్తంలో గ‌త ప్ర‌భుత్వం దేనిని వ‌దిలిపెట్ట‌లేదని పేర్కొన్నారు … సుంకిశాల ప్రాజెక్టును .2021 జులైలో నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. టన్నెల్ సైడ్ వాల్ ని జులై 2023 పూర్తి చేశారు. అంటే ఇది ఎవ‌రి హ‌యాంలో మొద‌లు పెట్టి.. ఎవ‌రి హ‌యాంలో పూర్తి చేశారో అంద‌రూ తెలుసుకోవాలన్నారు …

సాగ‌ర్ నీటిస్థాయిని దృష్టిలో పెట్టుకునే క‌దా మీ ప్ర‌భుత్వం డిజైన్ చేసి క‌ట్టించాల్సింది? దీనిని చూస్తుంటూ మీ డిజైన్లు ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయో అర్థం అవుతోంది. మీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు, డిజైన్లు, క‌ట్ట‌డాలు, పాల‌న‌, ఏర‌కంగా ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతోందన్నారు .

సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ క‌ట్టింది కాదు.. మా హ‌యాంలో మొద‌లు పెట్టింది కాదు. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల‌తో పాటు సుంకిశాల కూడా బీఆర్ఎస్ పాప‌మే. బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లు పెట్టిన మిగిలిన నిర్మాణాల ప‌రస్థితి కూడా భ‌విష్య‌త్తులో తేలుతుంది.

రాష్ట్ర ప్ర‌జ‌ల సొమ్మును ఏ ర‌కంగా దుర్వ‌నియోగం చేశారో ఇవ‌న్నీ చూస్తుంటే అర్థం అవుతోంది. ఒళ్లు గ‌గుర్పొడిచేలా కూలిపోయే నిర్మాణాల‌ను బీఆర్ఎస్ చేసిందని ధ్వజమెత్తారు …

బీఆర్ఎస్ హయాంలో డిజైన్ల లోపంతో నిర్మించిన సుంకిశాల గోడలు కూలిపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు.. కాంగ్రెస్ రాగానే కూలిందని గత పాలకులు పత్రిక, టీవీ ఛానల్ లో సుంకిశాల పాపం వేరొకరిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

నాడు సంపాదించిన అక్రమ సంపాదన ఉందని సోషల్ మీడియాలో ఎవరిదో ఈ పాపం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గట్టిగా బుద్ధి చెప్పారు మరోసారి లేవకుండా చేస్తారు.

సుంకిశాల సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని, దోషులు ఎవరో తేలుస్తామని భట్టి ఘాటు రిప్లై ఇచ్చారు …

Related posts

2004లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఇంకా అభివృద్ధి జరిగేది: కేసీఆర్

Ram Narayana

 పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి కేటీఆర్.. పోయిన బలం పెంచుకునేందుకే!

Ram Narayana

ఉదయం నుంచి రాత్రి వరకు… రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల ప్రచారం

Ram Narayana

Leave a Comment