Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

సహకార రంగంపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ …రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు ధ్వజం

సహకారరంగాన్ని బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెపుతున్న కేంద్రం ఆరంగంపై సవతితల్లి ప్రేమ చూపించడం దారుణమని రాజ్యసభలో బీఆర్ యస్ పక్ష ఉపనాయకులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు … గురువారం రాజ్యసభలో సహకారరంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు …గతంలో సహకార శాఖ లేకున్నా శాఖను ఏర్పుటు చేసిన నరేంద్రమోడీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఆయన ఎత్తిచూపారు …నిధుల కేటాయిపులే కాకుండా కేటాయించిన నిధులు ఖర్చు చేస్తున్నామని లేదా అనే విషయంలో కూడా శ్రద్ద చూపకపోవడం పట్ల పెదవి విరిచారు …సహకార రంగంపై తనకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే కేంద్రపనితీరుపై చురకలు అంటించారు …

దేశానికి రైతే వెన్నుముక…రైతే అన్నదాత…రైతు శ్రేయస్సే ముఖ్యం…అందుకే సహకార రంంగంపై మాట్లాడుతున్నట్లు తెలిపిన వద్దిరాజు శాఖను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే అందులో ఉన్న లోపాలను వివరించారు …

*2021 జూలై 6న, ప్రధాని నరేంద్రమోడి కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా.. సుమారు 8 లక్షల సహకార సంఘాల సమగ్ర సమాచారాన్ని రూపొందించి, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, సహకార సంఘాల కార్యాలయాలను కంప్యూటరైజ్ చేయడం వల్ల పారదర్శకత పెరిగి సభ్యులకు ప్రయోజనం చేకూరిందని గుర్తు చేశారు …

ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) పోర్టల్ ద్వారా 559 సహకార సంఘాలకు ‘కొనుగోలు దారులు’ అవకాశం కల్పించడం మంచి పరిణామమన్నారు… దీని ద్వారా దాదాపు 67 లక్షల మంది క్రయ విక్రయదారుల ప్రక్రియను స్పష్టంగా తెలుసుకునే వీలు కలుగుతుందని అన్నారు …
అట్టడుగు ప్రజలను వృద్ధిలోకి తీసుకురావడానికి సహకార రంగాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు …ఈ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా పని చేయడానికి గతంలో ప్రవేశపెట్టిన పలు బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చులతో పాటు కొత్తగా 2024 బడ్జెట్‌ కేటాయింపులను క్షుణ్ణంగా అధ్యయనం చేశానన్నారు …ఇందులో కొన్ని అంశాలను హైలెట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు ..

మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో చూపిన ఉత్సాహం…పనితీరులో లోపించింది …

అయితే.. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం చూపిన ఉత్సాహం.. అప్పుడు కనబరిచిన చిత్తశుద్ధి.. ప్రస్తుతం లోపించినట్లు స్పష్టమ వుతోంది
గడిచిన పలు బడ్జెట్లలో చేసిన కేటాయింపులు, ఖర్చు చేసిన నిధుల తీరు చూస్తే అర్ధమవుతుందని అన్నారు …2022-23 బడ్జెట్లో ఈ రంగం కింద సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు …2023-24 బడ్జెట్లో తొలుత కేవలం 55 కోట్లు కేటాయించి, ఆ తర్వాత మరో 300 కోట్ల అంచనాతో సవరించారని పేర్కొన్నారు …2024-25 బడ్జెట్ లో 500 కోట్లు అయితే కేటాయించారు, అయితే ఈ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ లక్ష్యసాధనకు తోడ్పడతాయో, లేదో, సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు …

గత 10ఏండ్లలో తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు, మహిళా, చేనేత, పలు వృత్తి కార్మికులకు ఆయా సహకార సంఘాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడంతో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పురోగతి సాధించిందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు …
కేంద్ర ప్రాయోజిత పథకాలైన..1. సహకార శిక్షణ, విద్య 2. సమగ్ర వ్యవసాయ సహకార పథకం గురించి సభ దృష్టికి తెచ్చారు ..2022-23 బడ్జెట్లో సహకార శిక్షణ, విద్య కోసం రూ.55 కోట్లు కేటాయిస్తే, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత 2024 – 25 బడ్జెట్లో కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం దురదృష్టకరం. సహకార శిక్షణ, విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు …

ఇప్పటికైనా ప్రభుత్వం పునః పరిశీలన చేసి నిధులు కేటాయింపు పెంచాలని కోరుతున్నాను
సమగ్ర వ్యవసాయ సహకార పథకం కోసం, 2022-23 లో 370 కోట్లు కేటాయించగా, 2023-24 లో కేవలం 1 లక్ష రూపాయలను మాత్రమే కేటాయించడం సహకారరంగాన్ని ఏవిధంగా బలోపేతం చేస్తుందో ఆర్థిక మంత్రి చెప్పాలని అన్నారు … 2024-25 బడ్జెట్ లో ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కేంద్రప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు …సహకార రంగంలో సప్లయ్ వ్యవస్థ సమర్ధవంతంగా లేకపోవడం, మౌలిక సదుపాయాలు, రవాణా, మార్కెట్ లింకేజి వంటి కారణాలతో పంటలు పండించిన తర్వాత రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు …తెలంగాణలో కేసిఆర్ పాలనలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు మూలమైన సహకార రంగం బలోపేతానికి పెద్ద ఎత్తున కృషి జరిగింది
ఫలితంగా వ్యవసాయం , దాని అనుబంధ సహకార రంగాలు అద్భుతమైన ప్రగతి సాధించాయన్నారు …

మన దేశంలో వరి, గోధుమ వంటి నిత్యావసర ఆహార ధాన్యాల నష్టం ఎక్కువగా అంతర్జాతీయ సంస్థలు గణాంకాలు పేర్కొంటున్నాయని,నష్టాలను అరికట్టే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు …సహకార రంగం సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర జాతీయ సహకార విధానాన్ని తీసుకువస్తామని బడ్జెట్లో ఆర్ధిక మంత్రి చెప్పారని ,ఆ మేరకు నిధుల కేటాయింపు, కేటాయించిన నిధుల వినియోగం పై దృష్టి సారించాలన్నారు …

రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహించడం, మార్కెటింగ్ , మౌలిక సదుపాయాల కల్పన, కూరగాయల ఉత్పత్తి సమూహాలకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు …సహకార సంఘాల్లో సాంకేతికతను జోడించడం, సభ్యులకు సామాజిక భద్రత పథకానికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు …
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పాలి
ఇది గ్రామీణ యువత, మహిళల్లో ఆర్ధిక సాధికారత సాధించడానికి దోహద పడుతుందని పేర్కొన్నారు ..బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించడం ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేస్తూ యువతకు,మహిళలకు మరింత తోడ్పాటు అందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరుతున్నట్లు చెపుతూ చివరలో “జై తెలంగాణ జై భారత్” తో తన ప్రసంగాన్ని ముగించారు వద్దిరాజు …

Related posts

తెలంగాణాలో సిబిఐ దర్యాప్తునకు నో ….లోకసభలో కేంద్రం వెల్లడి …

Ram Narayana

జయా బచ్చన్ పై రాజ్యసభ చైర్మన్ ఫైర్.. ఎందుకంటే…!

Ram Narayana

అవిశ్వాసంపై లోకసభలో కేంద్రంపై గర్జించిన బీఆర్ యస్ పక్ష నేత నామ…!

Ram Narayana

Leave a Comment