Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

భగ్న ప్రేమికులు …పెళ్లి చేసుకున్న గంటకే.. ఒకరిని ఒకరు చంపుకున్నారు!

ఏపీ అమ్మాయి …కర్ణాటక అబ్బాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు …ఇరు వైపులా కుటుంబాలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు …జంట చూడముచ్చటగా ఉందని పెళ్ళికి వచ్చిన పలువురు వారిని ఆశ్వీర్వదించారు …కానీ పెళ్లి రాత్రి బెడ్ రూంలోకి వెళ్లి రక్తపు మడుగులో కనిపించి ఇరు కుటుంబాలను శోకసముద్రంలో ముంచారు …ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న పచ్చి నిజం….

ప్రేమను పండించుకోవాలని ఎంతో మంది లవర్స్ ఎన్నో పాట్లు పడుతుంటారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోతే చిన్నపాటి నిరాహర దీక్ష చేపడతారు.

కానీ ఈ ఆదర్శ జంట తీరు మాత్రం వేరు. పెళ్లై 24 గంటలు గడవకముందే గొడవలు పడి ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని.. చంపుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడపలోని బైనపల్లికి చెందిన లిఖితశ్రీ, కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని చంబరసనహళ్లి ప్రాంతానికి చెందిన నవీన్.. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లిల్లో ఈ జంటను చూసి ఎంతో చూడముచ్చటగా ఉందని అనుకున్నారు వివాహానికి వచ్చిన వారంతా. జంటను ఆశీర్వదించారు.

వివాహ తంతు ముగిసింది. ఇద్దరు కలిసి ఎన్నో ఫోటోలు దిగారు. తమ ప్రేమ బంధం, పెళ్లిగా మారిందని సంబంరపడిపోయారు. అంతలో ఇద్దరు కలిసి రూంలోకి వెళ్లారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. కాసేపటికి ఇద్దరు గదిలో రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు.

ఏదో విషయంపై గొడవ పడ్డ ఇద్దరు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు. కుటుంబ సభ్యులను వారిని చూసి ఖంగుతిన్నారు. హుటాహుటిన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరణంలోనూ ఇద్దరు ప్రేమికులమని నిరూపించుకున్నారు..

కానీ నిజ జీవితంలో ప్రేమ, పెళ్లి ఇచ్చిన ఆనందాన్ని సార్థకత చేసుకోలేకపోయారు. ఈ ఘటన ఏపీలో కూడా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Related posts

చంద్రబాబు సభలో 8 మంది మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

Drukpadam

అరెస్టు భయంతో సికింద్రాబాద్​ అల్లర్లలో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం..

Drukpadam

భర్త, కుమారుడిని కట్టేసి మహిళపై దుండగుల అత్యాచారం!

Drukpadam

Leave a Comment