Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఉద్యమ సూరీడికి నీరాజనం పలికేందుకు హైద్రాబాద్ సన్నద్ధం …

తన జాస,శ్వాస,ఎస్సీల వర్గీకరణే లక్ష్యంగా గత 30 సంవత్సరాలు ఉద్యమమమే ఊపిరిగా నడిపిన మందకృష్ణ మాదిగ చివరికి విజయం సాధించారు … సుప్రీం ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు నివ్వడంతో మందకృష్ణమాదిగా సంతోషానికి అవధులు లేవు …వర్గీకరణ ఉద్యమానికి ప్రత్యక్షంగా , పర్వక్షంగా మద్దతు ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలిపారు …

సుప్రీం తీర్పు రోజు దేశరాజధాని ఢిల్లీ వెళ్లిన ఉద్యమ సూరీడు ఈనెల 13 వ తేదీన రాష్ట్రానికి రానున్నారు … ఎమ్మార్పీఎస్ ఆధ్వరంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నద్ధం అవుతుంది …తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు , ప్రత్యేకించి మాదిగ సామజికవర్గం హైద్రాబాద్ తరలి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది ..అందుకోసం వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు … లక్షలాదిగా హైద్రాబాద్ వస్తారని అంచనా వేస్తున్నారు …

మందకృష్ణమాదిగకు వర్గీకరణ ఉద్యమంలో అనేక ఆటుపోట్లు , అవమానాలు , నిద్రలేని రాత్రులు గడిపారు … అరెస్టులు , జైళ్లు లెక్కలేదు … ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను ఎత్తిన జండా దించలేదు …చివరకు శంకరుడు మేడలో పామును ధరించినట్లు తన మేడలో నల్ల కండువా కప్పుకొని ఊరువాడా పల్లె ,గల్లీ చివరకు దేశరాజధాని ఢిల్లీని కదిలించారు … సిద్ధాంత రాద్ధాంతాలు , జండాలు , ఎజెండాలు ఏవైనా తనకు మాత్రం అణగారిన తనజాతికి న్యాయం జరగాలంటే ఒక్క వర్గీకరణే మార్గమని అదే తన జెండా ఎజెండాగా అనేక కష్టనష్టాలకు ఓర్చి ముందుకు సాగారు …వేలాదిగా సభలు , వందలాది బహిరంగసభలు,పాదయాత్రలు , సైకిల్ యాత్రలు నిర్వహించి తన జాతిని జాగృతం చేశారు …మాదిగ అంటే తల దించుకోవడం కాదు తల ఎత్తుకొని బతకాలని బోధించారు …వారిని చైతన్య పరిచారు …ఊరూవాడను ఏకం చేసి వర్గీకరణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు … మందకృష్ణ అంటే ఒక నమ్మకం ,విశ్వాసం కలిగించారు … పాలకులు పదవుల ఆశచూపినా, ఎన్నడూ వాటికీ లొంగలేదు …ఉద్యమంలో వెన్ను చూపలేదు …అనేక ఉద్యమాలకు ఆయన ఒక రోల్ మోడల్ గా నిలిచారు … అందులో ఆయన సక్సెస్ అయ్యారు … మందకృష్ణమాదిగ అంటే ఒక పోరాట యోధుడుగా పేరు తెచ్చుకున్నారు …అందుకే ఆయనకు ఒక్క మాదిగ సామాజికవర్గంలోనే కాకుండా ఇతర సామాజికవర్గాల్లోను అభిమానులు ఉన్నారు …

ఎస్సీ వర్గీకరణను దక్షిణాది రాష్ట్రానికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు వెంటనే స్వాగతించారు … ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే స్పందించి స్వగతం చెప్పారు … అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వచ్చి వర్గీకరణకు మద్దతు ప్రకటించడమే కాకుండా తనకు మందకృష్ణ తమ్ముడు అంటూ సంబోధించారు … అందుకే వర్గీకరణ సాకారంలో నరేంద్రమోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు . వర్గీకరణకు సహకరించిన ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వర్గీకరణ అమలుకు అన్ని రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే దానిని అమలు చేయాలన్నారు. వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రాలు కూడా వెంటనే అమలు చేసేలా ప్రధాని మోదీ సూచించాలని కోరారు.

వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పినందుకు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా చాలా పేదకుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

రేపల్లె సికింద్రాబాద్ రైల్లో పెద్ద శబ్దాలతో ఎగిసిపడిన మంటలు ..రైలు నిలిపివేత

Ram Narayana

రాష్ట్రగీతం వేరే రాష్ట్రంవారితో కంపోజ్ చేయించడంపైనా అభ్యంతరమట …!

Ram Narayana

టీడీపీలోకి తీగ‌ల కృష్ణారెడ్డి మరి కొందరు మాజీలు

Ram Narayana

Leave a Comment