సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక …బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు…
ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు…
గోబెల్స్ ప్రచారంతో బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టలేరు
జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా ఒరిగిందేమీ లేదని ఎద్దేవా…..
సీతారామ ప్రాజెక్టు ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారధి, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక.. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికిగాను కేసీఆర్ స్వయంగా రూపకల్పన చేసి నిధులు కేటాయించి రూపొందించిన ఖమ్మం జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకం, కానీ ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధుల కేటాయింపులు ఇవ్వకుండా కేసీఆర్ నిర్మాణం చేసిన ప్రాజెక్టును తాము చేసినట్టుగా జిల్లాలోని ముగ్గురు మంత్రులు చెప్పుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విమర్శించారు. బుధవారం ఖమ్మం బీఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, తదితరులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తిచేసినట్టుగా చెప్పుకుంటూ బీఆర్‌ఎస్‌పై తప్పుడు పద్దతుల్లో గోబెల్స్ ప్రచారం చేస్తూ వారి తప్పును కప్పి పుచ్చుకుంటన్నారని తాతా మధుసూదన్ విమర్శించారు. గరువారం వైరాలో జరిగే సభలో పాల్గొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి సీతారామ ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ మంత్రులు ప్రగల్భాలు పగుతున్నారనీ, ఆయన మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా మహబూబాబాద్ మరియు నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు గాను సీతారామను డిజైన్ చేసిందెవరు..? బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని..? కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని..? ప్రాజెక్డు నిర్మాణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాత్ర ఎంత..? కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఎంత..? బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిచేసిన కాలువలు ఎన్ని..? కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసిన కాలువలు ఎన్ని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్న మూడు మోటార్లు బిగించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమా..? కాంగ్రెస్ ప్రభుత్వమా..? ఇలాంటి అనేక విషయాలపై సీఎం ఉమ్మడి జిల్లా ప్రజలకు సీతారామ ప్రజెక్టుపై వాస్తవాలు వెల్లడిచేయాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపిన అభివృద్ధిని తాము చేసినట్టుగా చెప్పుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8నెలలు పూర్తవుతున్నా.. ఇచ్చిన హామీలకు దిక్కులేదన్నారు. పక్క రాష్ట్రంలో పెంచిన రూ.4వేల పించన్‌ను పాత బకాయిలు కలిపి ఒకే సారి రూ.7వేల పించన్లు అందిస్తే తెలంగాణలో 8నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పించన్లు అందించేందుకు తాత్సారం చేస్తూ బడుగులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు తదితర బృహత్తర పథకాలను అటకెక్కించారని తాతా మధు ఎద్దేవా చేశారు. ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ అంటూ ఊదరగొడుతూ.. కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటికీ 40శాతం మంది రైతులకు రుణమాఫీ కూడా అందలేదన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంటుపై నోరెత్తడం లేదనీ, కేవలం బీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ సంకల్ప సిద్దితో పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లకు సాగునీరు మరియు రాజధాని హైదరాబాదు నగరానికి మంచినీరు అందించే వరప్రదాయని అయినది. కాలేశ్వరం విఫల ప్రయోగం అని రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం విఫలం కావడంతో ముఖం చాటేసిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య ఉత్పత్తి ఉంటే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ధాన్యం దిగుబడిని మూడు కోట్ల మెట్రిక్ టన్నులు పెంచి యావత్ దేశంలోనే ధాన్యం ఉప్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుందని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ గుర్తుచేశారు. కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని అన్నారు.
కరువు ప్రాంతం పాలేరులోని వివిధ మండలాల్లో పడావుపడిన బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గాను కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రతిష్టాత్మకంగా భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేసి 70వేల ఎకరాలకుపైగా ఆయకట్టును స్థిరీకరించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌నే మించి పోయారు…జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని తాము చేసిందని చెప్పుకుంటూ బీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చెయ్యడంలో కాంగ్రెస్ మర్రతులు, నాయకులు ఏకంగా గోబెల్స్‌నే మించిపోయారని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టు పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందనీ, చివరి పనులు పూర్తిచేసి తామే సాధించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గడిచిన ఎనిమిది నెలలుగా బీఆర్‌ఎస్‌ను విమర్శించడమే తప్ప చేసిన అభివృద్ది ఏమీ లేదని కమల్‌రాజు మండిపడ్డారు. ఒక పక్క ప్రజలు విషజ్వరాలతో హాస్పిటళ్లలో చేరుతున్నారనీ, బెడ్లు కాళీ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, ఒక్క మంత్రి కూడా ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణు, ఉప్పల వెంకటరమణ, బిఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.