తెలంగాణ రాజకీయ వార్తలు ..

రేవంత్ రెడ్డి సర్కారును ప్రశంసించిన బీజేపీ ఎంపీ… ఎందుకంటే?

  • ఎక్స్ వేదికగా స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాల కూల్చివేతను అభినందించిన ఎంపీ
  • హైడ్రా చర్యను అభినందిస్తున్నానని వెల్లడి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ అంశంపై రేవంత్ రెడ్డి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ మంచి చేస్తే అభినందించాలని… అలాగే తప్పు చేస్తే విమర్శలు చేయాలి.. నిలదీయాలని పేర్కొన్నారు.

సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినందుకు ఓ బీజేపీ నాయకుడిగా అభినందిస్తున్నానని… ఇది తనకు సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో తప్పు చేస్తే ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. సరస్సులను కాపాడటానికి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా చర్యను తాను అభినందిస్తున్నానన్నారు. దీనిని వారు కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు.

Related posts

ఆ ముగ్గురి సారథ్యంలో తెలంగాణ బీజేపీ బస్సు యాత్ర

Ram Narayana

నేను పదేళ్లు సీఎంగా ఉన్నా… ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తా: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు

Ram Narayana