Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

మండలి ప్రతిపక్ష నేత పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా!

  • ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స
  • ఇప్పటి వరకు మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల
  • జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని వెల్లడి

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న లేళ్ల అప్పిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. సీనియర్ నేత బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన కోసం తన పదవిని త్యాగం చేశానని అప్పిరెడ్డి చెప్పారు. తన విన్నపాన్ని తొలుత తమ అధ్యక్షుడు జగన్ అంగీకరించలేదని… అయినప్పటికీ తన విన్నపం మేరకు జగన్ ఆమోదించారని తెలిపారు. జగన్ వైసీపీని స్థాపించినప్పటి నుంచి తాను ఆయనతోనే ఉన్నానని చెప్పారు. జగన్ ఆశీస్సులతోనే తాను మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్సీ పదవి కూడా జగన్ వల్లే వచ్చిందని చెప్పారు. జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని తెలిపారు.

Related posts

సిట్ కార్యాలయానికి లోకేశ్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ

Ram Narayana

మంగళగిరి నుంచే పోటీ …నారా లోకేష్

Ram Narayana

పార్టీ మారుతున్నారనే వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందన…

Ram Narayana

Leave a Comment