Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎవరు పీసీసీ …? ఎవరు మంత్రులు హస్తినలో కుస్తీ ..అధిష్టానంతో రేవంత్ బృందం భేటీ …!

అధికారంలో ఉన్న తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలి …? ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి అనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి బృందం హస్తినలో కుస్తీ పడుతుంది …గత కొన్ని నెలలుగా ఈవిషయాలు పై చర్చలు జరుగుతూనే ఉన్న ఒక కొలిక్కి రాలేదు …ప్రతిసారి ఢిల్లీ వెళ్లడం చర్చంచడం ఒక ప్రవాసానంగా మారింది …సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు …ఆయన సీఎం కాగానే మరొకరికి ఆ భాద్యతలు అప్పగించాల్సి ఉంది …కానీ గత ఏడెనిమిది నెలలుగా అది వాయిదా పడుతూ వస్తుంది …నేడు అత్యవసరంగా ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మరో మంత్రి సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని హస్తినకు ఆహ్వానించారు ..

వారు శుక్రవారం నాడు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులు, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణపై గతంలోనూ పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే రాష్ట్ర ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.

మంత్రివర్గంలో నలుగురికి చోటు?

మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం నలుగురిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబితాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి ముదిరాజ్‌లలో నలుగురికి చోటు దక్కనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పీసీసీ అధ్యక్ష పదవిలో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికైనా ఒక నిర్ణయానికి వస్తారా లేక మల్లు వాయిదా వేస్తారా ..?అనేది ఆసక్తిగా మారింది …

Related posts

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మా పార్టీ పని చేస్తుంది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

Ram Narayana

కవితను జైల్లో పెట్టినా భయపడకుండా పోరాటం చేస్తూనే ఉన్నాం: కేటీఆర్

Ram Narayana

టీ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు!

Ram Narayana

Leave a Comment