Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానం

గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు తెలంగాణాలో భారీ నష్టం జరిగిందని వరదకు డెబ్బదిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా పర్యటించాలని ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు …సోమవారం ఖమ్మం జిల్లాలో వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ఖమ్మం కలెక్టరేట్ లో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అనేక విషయాలపై మాట్లాడు …

సీఎం మాటల్లోనే ….

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు భారీ నష్టం జరిగింది …రోడ్స్ , విద్యుత్ , పంట నష్టాలు ,గత మూడు రోజులుగా మంత్రులు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు నమ్మకం కల్పించడం అభినందనీయం…అధికార యంత్రాంగాన్ని సమన్వయము చేయడం జరిగింది …16 ప్రాణాలు , పశువులు , పంట లక్షల ఎకరాల్లో జరిగింది …హైద్రాబాద్ లో ఉండి పరిశీలించడం కాకుండా , క్షేత్రస్థాయిలో పర్యటించడం పరిశీలించడం జరిగింది …నేను స్వయంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ , కోదాడ , పాలేరు , ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని ప్రాధమికంగా తెలుసుకున్నాను …ఇప్పుడు అంటూ రోగాలకు అవకాశాలు ఉన్నాయి..వాటిని నియంత్రించాలి , మున్సిపల్ , పంచాయతీ రాజ్ శాఖ అధికారులను అప్రమత్తం చేయగలిగాము …ప్రధాని , హోమ్ మంత్రికి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వివరించం …ఎన్డీఆర్ఫ్ నుంచి సిబ్బందిని తీసుకున్నాం …

ప్రధానికి జాతీయ విపత్తుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశాను …చాలామంది ఇంట పెద్ద వరదలు చూడలేదని అంటున్నారు …40 సెంటీమీటర్ రావడం ప్రకృతి విపత్తు … కేంద్రం సహాయం అందిస్తే వెంటనే రైల్వే , రోడ్స్ ,పునరుద్ధరించుకోవడాని అవకాశం ఉంది. 5438 కోట్ల రూపాయలు అష్టి నష్టం జరిగింది …తక్షణమే నిధులు విడుదల చేయమని లేఖ రాయడం జరిగింది …నిధులే కాదు ..ప్రధాని స్వయంగా పర్యటన చేయమని ఆహ్వానించాను …రాజకీయాలకు అతీతంగా చూడాలి …ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి…
ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నష్టాలను పరిశీలించాలి …కేటీఆర్ అమెరికాలో ఉండి మంత్రులు లేరని మాట్లాడటం దుర్మార్గం …ఇది తగదు ..మంత్రులను బద్నామ్ చేయాలనీ అనుకుంటే కుదరదు …విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేయాలి …కేంద్రంపై వత్తిడి చేయాలి …జాతీయ విపత్తుగా ప్రకటించామని చెప్పరు. ప్రాణ ,ఆస్తి ,పంట నష్టం జరిగితే దాన్ని గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేయడం తగదు … రాజీవ్ గృహకల్ప , బొక్కల గడ్డ చూశాను సర్వం కోల్పోయారు …వారికీ ఎంత ఇచ్చిన తక్కువ అవుతుంది …34 క్యాంపులు , 3 వేల కుటుంబాలు , 7 వేల మందికి పైగా ఉంటున్నారు ..వెంకయ్య నాయుడు లాంటి వారు ముందుకు వచ్చి సహాయం చేయారు …ప్రభుత్వం సహాయం చేయడంలో వెనక్కు పోదు …రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు , పశువులు , గొర్రెలు ,మేకలకు కూడా ఇస్తున్నాము …భాదిత కుటుంబానికి తక్షణం 10 వేల రూపాయలు ఇవ్వమన్నం …అందుకే ఖమ్మం కలెక్టర్ కు 5 కోట్ల విడుదల చేశాను …కొత్తగూడం , మహబూబాబాద్ ,సూర్యాపేట జిల్లాలకు నిధులు ఇచ్చాం …నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ టీం లాగా రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ….గత ప్రభుత్వం ఇలాంటివి చేయలేదు … కష్ట సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం …కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పిలుపు ఇచ్చాం …ప్రజలు ఉపయోగపడే సూచనలు చేయండి …ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం… రిస్టోర్ ,రిపేర్ , అంచనాలు చేయండి …నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులను గుర్తించండి …పోలీస్ సహకారం తీసుకోండి …అవసరమైతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అవసరమైన సిబ్బందిని తీసుకోండి …ప్రజలకు అండగా నిలబడటం మన బాధ్యత …సమన్వయం కీలకం …మీడియా లో కొన్ని పొలిటికల్ మీడియా ఉంది…దాన్ని మేము ఏమి అనడంలేదు …కొన్ని పార్టీలు కరపత్రాల లాగా రాసుకుంటున్నాయి….రేపు సాయంత్రందాకా ఖమ్మంలోని ఉంటా స్వయంగా చూస్తానని వెల్లడించారు …స్వయంగా చూస్తేనే తనకు అడిగే దగ్గర గట్టి పట్టు పెట్టె అవకాశం ఉంటుందని అన్నారు ..

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జిల్లాలో ఆపార నష్టం జరిగిందని సీఎం వెంటనేస్పందించి ఇక్కడకు వచ్చి స్వయంగా చూడటం అభినందించదగ్గ విషయమని అన్నారు …ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు .
మంత్రి తుమ్మల మాట్లాడుతూ సీఎం ఉపద్రవం వచ్చిన వెంటనే రావడం ఎప్పుడు జరగలేదు …ఇది మంచి సూచన…కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి సహాయం పొందాలని కోరుతున్నానని అన్నారు …

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ … 22 సెంటీమీటర్స్ వర్షం …ఎర్రుపాలెం , మధిర లలో కురిసింది …అధికారులను అలర్ట్ చేశాం …మధిరలో క్యాంపు లు పెట్టాం …ప్రాణాలను రక్షించించడం జరిగింది … 20 సెంటీమీటర్ పైగా వర్షం వచ్చింది …అజ్మీరా తండా ఊరంతా చుట్టూ వరద వచ్చింది …ప్రభుత్వం సహకరించింది …ములుగు నుంచి ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు వచ్చాయి…హెలికాప్టర్ ఏపీ నుంచి ఆలస్యంగా వచ్చింది …193 మందిని కాపాడగలిగాం …తరవాత రోజు కూడా రిలీఫ్ క్యాంపు , ఐదు అంశాలపై కేంద్రీకరించాం …హెల్త్ ఇప్పటికే ఇబ్బందిగా ఉంది వర్షాల వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది …అందువల్ల దానిపై కేంద్రీకరించాం …ఆశాలు, ఏ ఎన్ ఎం లు ప్రాధమిక చికిత్స కోసం క్యాంపులు …మూడు నాలుగు అడుగులు సీల్ట్ ఇళ్లలో ఉంది …వాటిని క్లియర్ చేయాలనీ పెట్టుకున్నాం …సీఎం కలెక్టర్ గారు ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి సహాయం కావాల్సి ఉందా…మీరు ఇప్పటికే ఇచ్చారని కలెక్టర్ తెలిపారు …

కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎమ్మెల్యేలు ప్రత్యేక అధికారి వి పి గౌతమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు ..

Related posts

 తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్!

Ram Narayana

మంత్రి తుమ్మల తొలి సంతకం…..

Ram Narayana

పెన్షన్ కింద ఇచ్చిన రూ. 1.72 లక్షలు వెనక్కి ఇవ్వాలని వృద్ధురాలికి నోటీసులు..

Ram Narayana

Leave a Comment