Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఖమ్మంజిల్లాలో సీఎం పర్యటన …వరద ప్రాంతాల పరిశీలన …భాదితులకు భరోసా!

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం ఖమ్మం జిల్లాలోని వరదలకు దెబ్బతిన్న ప్రాంతం పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు . ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడవద్దు అని భరోసా ఇచ్చారు .ప్రతి భాదిత కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున తక్షణ సాయం అందించనున్నట్లు తెలిపారు . రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి తొలత సూర్యాపేట లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి వారికి భరోసా కల్పించారు . ఆయన వెంట మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు . అక్కడినుండి వారు రోడ్డు మార్గాన పాలేరు చేరుకొని అక్కడ పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు . రిజర్వాయర్ అలుగు ద్వారా పొంగటంతో వాగు ద్వారా కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు అక్కడ జరిగిన నష్టం విషయాలను దంపతులు కొట్టుకొని పోయిన విషయాన్నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సీఎం కు వివరించారు . ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులు ముఖ్యమంత్రికి నాయకులగూడెం టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికారు . ఖమ్మం జిల్లాలో జరిగిన వరద నష్టం భారీగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన నష్టం పై త్వరలో సమగ్ర సర్వే జరిపించి బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు . మున్నేరు వరదలను నీటమునిగిన పాలేరు నియోజకవర్గం లోని కరుణగిరి ప్రాంతంలో ఉన్న పోలేపల్లి పరిధిలోని సాయి గణేష్ నగర్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ,టీ ఎన్ జి ఓ కాలనీ ప్రాంతాలను పరిశీలించారు. ఖమ్మం లోని రాపర్తి నగర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను , కాలవ ఒడ్డు బొక్కల గడ్డ, రంగనాయకుల గుట్ట ప్రాంతాలను సీఎం స్వయంగా పరిశీలి బాధితులతో బాధితులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడవద్దు అని భరోసా ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు . మంత్రులు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని సీఎం పేర్కొన్నారు. తమకు సహాయం అందడం లేదని, అన్నం నీళ్లు లేక గత రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు సీఎం దృష్టికి తీసుకుపోయారు. దానిపై సీఎం ఇకనుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రంగాం చూసుకుంటుందన్నారు . అనంతరం ప్రకాష్ నగర్ బిడ్జిని పరిశీలించారు. ఆదివారం ఆ బ్రిడ్జిపై మున్నేరు వరద పారిన సందర్భంగా తొమ్మిది మంది అందులో విరుక్కపోవడంతో వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరిగాయి . ఎట్టకేలకు రాత్రి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ ప్రజల నుంచి నిమర్శలు వచ్చాయి ప్రభుత్వం పని చేయటం లేదని ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్న వేస్ట్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

వాతావరణం అనుకూలించక సీఎం రోడ్డు మార్గాన ఖమ్మం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంభం పర్యటనకు హెలికాప్టర్ ద్వారా రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గాన వచ్చారు . హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం సరిగా లేకపోవడం వర్షాల వల్ల హెలికాప్టర్ వెళ్లటం కష్టమని చెప్పడంతో ఆయన రూట్ మార్చుకున్నారు . తప్పని పరిస్థితులు ఖమ్మం సూర్యాపేట మీదగా ఖమ్మంకు వచ్చారు. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు . సీఎం వెంట మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు . జిల్లా పర్యటనలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఇతర అధికారులు ఉన్నారు … ముఖ్యమంత్రి ఈ రాత్రికి ఖమ్మంలోని బసచేయనున్నారు రేపు ఉదయం ఇక్కడి నుండి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం …

Related posts

తెలంగాణలో మరో రెండు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు

Ram Narayana

On welfare measures of journalists After January 15 High level meeting

Ram Narayana

జిల్లాల తగ్గింపు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు …!

Ram Narayana

Leave a Comment