Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అధికారుల నిర్లక్ష్యణ భారీ నష్టానికి కారణం…సిసిఐ నేత భాగం హేమంతరావు

అధికారుల నిర్లక్ష్యం అంచనా వేయడంలో వైఫల్యం ఖమ్మం నగరంతో పాటు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు భారీగా నష్ట పోయేందుకు కారణమైందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. 30, 31 తేదీలలో భారీ వర్ష్యాలు ఉన్నాయని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించిన మున్నేరు ప్రభావిత ప్రాంతాలలో కార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని తెలిసి కూడా ప్రజలను అప్రమత్తం చేయలేదని హేమంతరావు తెలిపారు. సిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ సహా సిరీల బృందం పలు ప్రాంతాలలో పర్యటించింది. వెంకటేశ్వర నగర్. బొక్కలగడ్డ, సూరీ నగర్, పంపింగ్ వెడ్డు, ప్రకాష్ నగర్, జంగు నగర్, నాయుడు పేట, రాజీవ్ గృహకల్ప, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ, కన్నితండా.

ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్ల పరద రావడంతో కట్టు బట్టలతో డ్లు పడితే బయటకు వచ్చారని కనీసం చేతికి అందే సామాన్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని హేమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా పాడైపోయాయని అనేక ఇండ్లు గోడలు కూలాయని ఇంటి పైకప్పులు లేచిపోయాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పిల్లలు పుస్తకాలు,సర్టిఫికెట్స్ కూడా ముందస్తు సమాచారం లేకపోవడంతో పోయాయని ఆయన తెలిపారు. ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రతి ఇంటికి తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు యుద్ధ ప్రాతిపదికన పుస్తకాలను సరఫరా చేయాలని నీరుపేదలకు బట్టలు, నిత్యావసర సామాగ్రిని నెలకు సరిపడ అందించాలని ఆయన కోరాడు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలను కాపాడాలని వరద సహాయక విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు ,మేకల శ్రీనివాసరావు జిల్లా సమితి సభ్యులు యానారెడ్డి ఇటికాల రామకృష్ణ భూడ్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ..

Ram Narayana

మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …

Ram Narayana

ముగిసిన ఎన్నికల కోడ్ …అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం ద్రుష్టి ..

Ram Narayana

Leave a Comment