Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ ను అభినందించిన ఎంపీ వద్దిరాజు ..

9 మంది సామాన్యులు ఖమ్మం మున్నేరు వరదలో చిక్కుకున్నారు

తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు పైగా మంత్రులు తమను కాపాడుతారని నమ్మకంతో ఎదురు చూశారు…. హెలికాప్టర్ ద్వారా వాళ్ళను రక్షించాలని స్థానిక ప్రజలు ఆ ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు…ఐనా స్పందన లేదు

సమయం గడిచిపోతుంది అప్పటికే 13 గంటలు అయింది….వరద ఉదృతి అంతకంతా పెరుగుకుంటూ పోతుంద… వాగులో ఇరుకున్న ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు

ఈ ప్రభుత్వాన్ని మంత్రులను నమ్ముకుంటే లాభం లేదని స్థానికులు ఆ భగవంతుని మీద భారం వేసి ఎదురు చూస్తున్న సమయంలో…అప్పుడు వచ్చాడు ఒక జేసిబి డ్రైవర్… పోతే నేను ఒక్కడిని.. వస్తే మేము పది మంది అంటూ ప్రాణాలకు తెగించి జేసిబితో వెళ్ళాడు ఆ సామాన్య డ్రైవర్

అన్నట్లే మున్నేరు వరదలో చిక్కుకున్న 9 మందిని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు… కెసిఆర్ గారి పాలనలో వరదలు వచ్చినా అప్పటి ప్రభుత్వం రెండు మూడు రోజులకు ముందే ప్రజలను అప్రమత్తం చేసేదని… ప్రజలకు ఇలాంటి కఠిన పరిస్థితి ఎదురైనప్పుడు యుద్ధ ప్రాదికన స్పందించేదని… ఇప్పుడు జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగ పడలేదని తమ బాధను వెల్లగక్కారు

ఆ 9 మందిని కాపాడిన జేసిబి డ్రైవర్ ను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్ధిరాజు గారు మరియు మాజీ మంత్రి అజయ్ గారు స్వయంగా కలిసి అభినందించారు… ముంపు బాధితులను పరామర్శించారు

Related posts

Drukpadam

సినీ నటుడు మోహన్ బాబు పై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు …

Drukpadam

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ప్రముఖులు… 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

Ram Narayana

Leave a Comment