Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం వరదల్లో బురద రాజకీయాలు …హరీష్ రావు వాహనంపై దాడి

వరదబాధితులను ఆదుకోలేక మాపై దాడులా… పైగా నలుగురు మాజీ మంత్రులు నలుగురు శానసభ్యులు ,ఎమ్మెల్సీ వరద భాదితులను పరామర్శించేందుకు వెళ్ళితే హత్య యత్నం చేస్తారా …ఏమిటి ఈ చిల్లర రాజకీయాలు …మీ దాడులకు ,బెదిరింపులకు భయపడం ఖబర్దార్ అంటూ బీఆర్ యస్ నేతలు మీడియా సమావేశంలో కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు ..ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు , మంచినీళ్లు , విద్యుత్ , ఇసుక మేటలు తొలగించడం ,వారికీ భోజన వసతి సౌకర్యాలు కల్పించడం చేయాల్సింది పోయి ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలకు పాల్పడితే మంచిదికాదని ప్రజలు తమకు అవకాశం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెడతారని మాజీ మంత్రి బీఆర్ యస్ నీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు …మంగళవారం ఖమ్మం జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు… వరదబాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. తమకు ఇంతవరకు అరకొర సహాయమే అందిందని భాదితులు వాపోతున్నారని పేర్కొన్నారు ..జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ప్రజలను కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శలు గుప్పించారు .. అటు అధికార పార్టీ నేతలు కూడా బీఆర్ యస్ వరదలో బురద రాజకీయాలు చేస్తుందని కౌంటర్ ఎటాక్ చేశారు …హరీష్ రావు వాహనంపై దాడి విషయంపై మంత్రి తుమ్మల మాట్లాడుతూ దాడి ఎవరు చేసిన సరైంది కాదని అన్నారు …అక్కడ ఏమి జరిగింది .. పోలీసులు విచారిస్తారని అన్నారు .. 10 సంవత్సరాల కాలంలో తిన్న లక్ష కోట్లలో ఒక 10 వేల కోట్లు వరద భాదితులకు అందజేస్తే మంచిదని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు …

ప్రజలకు గత మూడు రోజులుగా కరెంటు లేదు.. నీళ్లు లేవు. ఇది ఒక దివాలా ప్రభుత్వంగా మారిపోయిందని హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు . కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని కేంద్ర విధానాలను ఆయన దుయ్యబట్టారు …కాంగ్రెస్ +బీజేపీ 8+8=16 ఎంపీ సీట్లు వచ్చిన రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు ఎవరి లోపం … కేంద్రం నుంచి ఎన్డీఆర్ఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారని విమర్శించారు … కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకోని పొతే మేము కూడా కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు ..

వరదలు వచ్చినప్పుడు ముందుగానే అనౌన్స్మెంట్ చేసి మీరు ఇల్లు ఖాళీ చేసి సుదూర ప్రాంతానికి వెళ్లాలని చెప్పి ఉంటె ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు .భాదితులు గత ప్రభుత్వం చాల అలర్ట్ గా వరదలప్పుడు మంత్రిగా ఉన్న అజయ్ తమను కాపాడారని ప్రజలే చెపుతున్నారని అన్నారు … ఈసారి ప్రభుత్వం లేదు ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు .తమకు జరిగిన నష్టంపై కన్నీరు మున్నీరు అవుతున్నారని వారి మాటలు వింటే చాల ఘోరంగా హృదయవిదారకరంగా ఉందని అన్నారు ..అదేవిధంగా సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు ఏవైతే నష్టపోయిన డాక్యుమెంట్లు , మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయాయని పిల్లలందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్ ఇప్పించే కార్యక్రమం చేపట్టి ఆదుకోవాలని కోరుతున్నారని అన్నారు ..

రాష్ట్రంలో వరదలకు 30 మంది చనిపోతే 16 మనదేనని వాటిని కూడా తక్కువ చెప్పడం దుర్మార్గమని అంటూ వారి పేర్లను చదివి వినిపించారు .. సాంబశివరావు పద్మావతి అశ్విని మోతిలాల్, రాము,తిరుమలాపూర్ గ్రామంలో వనపర్తి లో వడ్డీ చంద్రయ్య, పెద్దపల్లిలో పవన్, గోస్కుల కుమార్ కామారెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్ , రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్ 30 మంది పేర్లు లిస్ట్ హరీష్ రావు చదివారు …చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి 25 లక్షల ఇవ్వాలన్నారు … గతంలో రేవంత్ రెడ్డి 25 లక్షలు ఇవ్వాలని తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్నీ గుర్తు చేశారు ..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇయ్యాలని ఇదే సీతక్క అడిగారు . మీరు గతంలో అడిగిన డిమాండ్ పై నిలబడి తక్షణమే 25 లక్షలతోపాటు ,మీరు అప్పుడు అన్నట్లుగానే ప్రతికుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు .. ఖమ్మం జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లా కొత్తగూడెంమహబూబాద్ జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తం కావడం భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పంట నష్టం జరిగిందని ఆ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు …ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుందని విమర్శలు గుప్పించారు ..

గతంలో మున్నేరుకు వరదలు వచ్చినప్పుడు అజయ్, వెంకట వీరయ్య , ఉపేందర్ రెడ్డి నామ నాగేశ్వరరావు విజ్ణప్తి మేరకు సీఎం కేసీఆర్ 650 కోట్లతోని రెండువైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్లు శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా నిధులు మంజూరు చేశారని పనులను త్వరితగట్టిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .

మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వరద భాదితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అందువల్లనే అధిక నష్టం జరిగిందని అన్నారు …ముందు చూపు లేని తనం ప్రజలకు తక్షణ అవసరాలు అందించడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని అన్నారు …ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ , కౌశిక్ రెడ్డి ,ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ..

Related posts

ఆరు హామీలతో కాంగ్రెస్ జోష్.. ఏడో హామీని తెరపైకి తెచ్చిన రేవంత్‌రెడ్డి

Ram Narayana

చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు… ముఖ్యమంత్రి కాలేడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు

Ram Narayana

ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రాయల నా … ?మండన నా …?

Ram Narayana

Leave a Comment