Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు దుర్మ‌ర‌ణం!

  • అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఘ‌ట‌న‌
  • న‌లుగురు భార‌తీయుల మృతి
  • మృతుల్లో హైద‌రాబాద్‌కు చెందిన ఫ‌రూఖ్‌, ఆర్య‌న్ రఘునాథ్‌, లోకేశ్ పాల‌చ‌ర్ల‌ 
  • మ‌రొక‌రు త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన ద‌ర్శిని వాసుదేవ‌న్

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో రోడ్డు నం. 75లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు దుర్మ‌రణం చెందారు. తెలుగువారు ముగ్గురూ హైద‌రాబాద్ వాసులు కాగా, మ‌రొక‌రు త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. 

మృతుల్లో హైద‌రాబాద్‌కు చెందిన ఫ‌రూఖ్‌, ఆర్య‌న్ రఘునాథ్‌, లోకేశ్ పాల‌చ‌ర్ల‌, త‌మిళ‌నాడుకు చెందిన ద‌ర్శిని వాసుదేవ‌న్ ఉన్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. గ‌త శుక్ర‌వారం బెన్‌టోన్‌విల్లేకు వెళ్లేందుకు ఈ న‌లుగురు ఒకే వాహ‌నంలో ప్ర‌యాణించారు. 

ఈ క్ర‌మంలో వ‌రుస‌గా ఐదు వాహ‌నాలు ఒక‌దానినొక‌టి అతివేగంగా ఢీకొన‌డంతో వీరు ప్ర‌యాణిస్తున్న కారుకు ఒక్క‌సారిగా భారీ మంట‌లు అంటుకున్నాయి. దాంతో ఈ న‌లుగురు అందులోంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. వీరి మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా కాలిపోవ‌డంతో కార్ పూలింగ్ యాప్‌లో న‌మోదైన వివ‌రాల ఆధారంగా అక్క‌డి అధికారులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న టెక్సాస్‌లోని భార‌తీయ ప్ర‌వాసుల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Related posts

కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి మృతి

Ram Narayana

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం!

Ram Narayana

మలావి విమానం గల్లంతు విషాదాంతం… ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం…

Ram Narayana

Leave a Comment