Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ పోస్ట్… కేటీఆర్, హరీశ్ రావులకు కాంగ్రెస్ వార్నింగ్!

  • అన్నీ మేమే చేస్తే నువ్వేం పీకుతావ్ రేవంతూ⁉ అంటూ బీఆర్ఎస్ పోస్ట్
  • ఈ పోస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
  • కేటీఆర్, హరీశ్ రావు తమ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని సూచన

కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ఏం పీకాడని మేమూ అడగగలమని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేటీఆర్, హరీశ్ రావు తమ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది.

ఈ మేరకు ‘తెలంగాణ కాంగ్రెస్’ ఎక్స్ హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేసింది. “అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ⁉” అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. దీనిని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని నిలదీసింది. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడని మేమూ అనగలమని పేర్కొంది.

“కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు మీ సోషల్ మీడియాను అదుపులో ఉంచుకోండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడు!? అధికారం ఉన్నపుడు పీకింది ఏం లేదు, కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ పెద్దగా పీకేదేం లేదు! అని మేము కూడా అనగలం” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ తమకు సంస్కారం అడ్డు వస్తుందని, తమ పార్టీ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తోందని పేర్కొంది.

మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వెనుక మీ పార్టీ విధానాలు, మీ నాయకత్వం, మీ ఆలోచనలు ఎలాంటివో అర్థమవుతున్నాయని ఎద్దేవా చేసింది. ఒక పార్టీ అధికారిక ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించకోవాలని డిమాండ్ చేసింది.

Related posts

నడ్డా… తెలంగాణ కేసీఆర్ అడ్డా: హరీశ్ రావు

Ram Narayana

శ్రీధర్ బాబును కలిసిన పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు…

Ram Narayana

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చిందో అందరికీ తెలుసు: మల్లు భట్టివిక్రమార్క

Ram Narayana

Leave a Comment