Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా: భట్టివిక్రమార్క

  • తమ ప్రభుత్వం గురువులకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్న భట్టివిక్రమార్క
  • మన విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందన్న ఉపముఖ్యమంత్రి
  • అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి

తెలంగాణలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గురువులకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.

మన విద్యావ్యవస్థ ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా లేదన్నారు. మన విద్యావ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్రంలోని ఐఐటీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. మన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు.

అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఆదర్శమైన గురువులు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను వారు చాలా చక్కగా అమలు చేస్తున్నారని కితాబునిచ్చారు. ఇంగ్లీష్ మీడియంను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. గురువులు ఎంత గొప్పవాళ్లైతే సమాజం కూడా అంతే గొప్పగా మారుతుందన్నారు.

Related posts

జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ గడువు పొడిగింపు…?

Ram Narayana

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన

Ram Narayana

మంత్రి తుమ్మల తొలి సంతకం…..

Ram Narayana

Leave a Comment