Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కాంగ్రెస్ నేతల కోసం పోలిసుల వేట!

వైయస్సార్ కాంగ్రెస్ నేతలకు ఏపీ పోలీసులు వేట ప్రారంభించారు …ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికేసులో వైసీపీ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ,మాజీ ఎంపీ నందిగామ సురేష్ , మాజీ మంత్రి జోగి రమేష్ , నాయకులూ దేవినేని అవినాష్ తదితరులపై కేసు నమోదు అయింది …అయితే అప్పుడు వారు అధికారంలో ఉండటంతో వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ..అధికారం మారింది …ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో కేసులను తిరగదోడారు …దీంతో వైసీపీ నేతలు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఫలితం దక్కలేదు …దీంతో పోలీసులు vari అరెస్ట్ కోసం వేట మొదలు పెట్టారు …నందిగామ సురేష్ ను అరెస్ట్ చేసి కోర్ట్ కు తరలించారు …కోర్ట్ ఆయనకు 14 రోజులు కస్టడీ విధించింది …ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు …మాజీమంత్రి జోగి రమేష్ కోసం గాలింపు చేపట్టారు …ఒక పక్క మరో పక్క అరెస్టుల వేట ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది …

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ తో పాటు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు వున్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈ కేసులకు సంబంధించి అరెస్టును తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులకు చిక్కకుండా మాజీ మంత్రి జోగి రమేశ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. దేవినేని అవినాశ్ కూడా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాదులో గాలిస్తున్నారు. జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

అటు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న ఇతర వైసీపీ నేతలు ముందే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, నందిగం సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను గుంటూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, ఈ కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే.

Related posts

రెస్టారెంట్లలో సర్వీసు చార్జీ ఐచ్ఛికమే.. కట్టక్కర్లేదన్న కేంద్ర ప్రభుత్వం!

Drukpadam

చిరుతను మట్టు బెట్టిన సహసవీరుడు

Drukpadam

ఇది మన రైతుల ఘన విజయం.. సాగు చట్టాల రద్దుపై ప్రతిపక్షాల స్పందన!

Drukpadam

Leave a Comment