Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

వరద బాధితులకు సాయానికి ముందుకు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ

  • వరద బాధితుల ఇబ్బందులపై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం
  • థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల కోసం కేంద్రాల ఏర్పాటు

భారీ వర్షం, వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఆర్థిక సాయంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆయా థియేటర్ల వద్ద విరాళాల కోసం, వస్తువుల సేకరణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు, సినీ ప్రముఖులు వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు, తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… ఇలాంటి విపత్తుల సమయంలో సాయం అందించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా పరిశ్రమ నుంచి చేయూత ఉంటుందన్నారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చిత్రపరిశ్రమ అందుకు సిద్ధమే అన్నారు.

తాము, చిత్రపరిశ్రమ ఇలా ఉన్నామంటే అందుకు తెలుగు ప్రజలే కారణమని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో వారికి అండగా ఉంటామన్నారు. తమ మద్దతు ఉంటుందని చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేసి ఒక రోజు వేతనం వరద సాయానికి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వెల్లడించారు.

Related posts

భద్రాచలం వద్ద ఐదు ఊళ్ళు ఇవ్వాలని ప్రధానిని కోరాం…డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన

Ram Narayana

రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి ‘పద్మ విభూషణ్’ అందుకోనున్న చిరంజీవి…

Ram Narayana

Leave a Comment