ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమాస్తుల కేసు .. విచారణ వాయిదా…

జగన్ అక్రమాస్తుల కేసు .. విచారణ వాయిదా
-అరబిందో’ మాజీ కార్యదర్శి చంద్రమౌళి డెత్ సర్టిఫికెట్ సమర్పించాలని కోర్టు ఆదేశం
-హెటిరో, అరబిందో కేసు నిందితుడు చంద్రమౌళి ఏప్రిల్ 10న మృతి
-అభియోగాల నమోదుకు సమయం ఇస్తూ కేసును వాయిదా వేసిన కోర్టు
-జగన్‌ పిటిషన్‌పై విచారణ 22వ తేదీకి వాయిదా
-రాంకీ కేసులో విజయసాయి రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ విచారణ ఈ నెల 15 కి వాయిదా

 

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో, అరబిందోపై ఈడీ నమోదు చేసిన కేసు నిన్న సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన అరబిందో కంపెనీ మాజీ కార్యదర్శి పీఎస్ చంద్రమౌళి ఏప్రిల్ 10న మరణించారు. దీంతో ఆయన మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సీబీఐ కోర్టు ఈడీని ఆదేశించింది. అభియోగాల నమోదుకు సమయం ఇస్తూ కేసును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

కాగా, ఇదే కేసులో తన తరపున సహకరించడానికి మరో నిందితుడిని అనుమతించాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ విచారణకు రాగా దానిని కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణతోపాటు రాంకీ కేసులో ఏ-2 నిందితుడైన విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను ఈ నెల 15కు కోర్టు వాయిదా వేసింది.

Related posts

సీఎం జగన్ పై దాడి ఘటన పట్ల బెజవాడ సీపీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే…!

Ram Narayana

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు విచారిస్తామన్న చీఫ్ జస్టిస్.. !

Ram Narayana

తెలంగాణకు ఏపీ నుంచి వ‌స్తున్న ధాన్యం లారీలు తిరుగుముఖం!

Drukpadam