Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఎన్నికల్లో పైసల్ లేకపోతే గెలవడం కష్టం…కుండబద్దలు కొట్టిన జగ్గారెడ్డి

పైసలతోనే ఎన్నికలు అవి లేకపోతే కష్టం ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్ల ఖర్చు డబ్బున్నోడిది అధికారం .ఇది అన్నది ఎవరో కాదు అధికార పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి జగ్గారెడ్డి గా సుపరిచితులైన ఆయన గత ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేసి ఓడిపోయారు .ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు అవుతానని పలుమార్లు ప్రకటించుకున్నారు.

తెలంగాణ రాజకీయాలు మారిపోయాయని, ఎమ్మెల్యే, ఎంపీలు కావాలంటే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాజకీయాలు కులాలు, మతాలతో నడవడం లేదని, కేవలం డబ్బులతోనే నడుస్తున్నాయని ఆరోపించారు. ఇదంతా బీఆర్ఎస్ నిర్వాకమేనని, విభజన తర్వాత ఆ పార్టీ పుణ్యమా అని తెలంగాణ రాజకీయాలల్లో డబ్బుల సంప్రదాయం వచ్చిందని, గత ఎన్నికల్లో ఎలక్షన్ ఖర్చును బీఆర్ఎస్ కోట్లలోకి తీసుకుపోయిందని ఆరోపించారు. అందుకే ఈ రోజుల్లో ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కుమ్మరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని షాకింగ్ లెక్కలు కూడా చెప్పారు. ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గా పోటీచేయాలంటే రూ.50కోట్లు, పటాన్ చెరువుకు రూ.100కోట్లు, ఇక ఎంపీగా పోటీ చేస్తున్నామంటే రూ.50 నుంచి రూ.100 కోట్లు ఖర్చుపెట్టనిదే గెలిచే ఛాన్స్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి ఈ రోజుల్లో కులాల అండతో, మతాల అండతో రాజకీయం నడవడం లేదని, కేవలం పైసలతోనే నడిచే దుస్థితి దాపురించిందని, దీనికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్ కుమార్‌ గౌడ్‌ కు శుభాంకాక్షలు తెలిపారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి …జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …

Ram Narayana

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నం …ఏడో నిజాం మనమరాలు

Ram Narayana

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌసులు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రేపే ప్రారంభం ..

Ram Narayana

Leave a Comment