Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మోదీపై నాకేం ద్వేషం లేదు.. రాహుల్ గాంధీ !

  • టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులు, ఎన్ఆర్ఐలతో ఎంపీ భేటీ
  • ఆయన ఆలోచనా విధానం వేరు, తనది వేరని వివరణ
  • మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత

భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకేమీ ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను తప్ప ఆయనను ద్వేషించడంలేదని వివరణ ఇచ్చారు. ఈమేరకు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆలోచనలు వేరు, తన ఆలోచనా విధానం వేరని రాహుల్ చెప్పారు. వాస్తవానికి కొన్ని విషయాల్లో ఆయన పట్ల తనకు సానుభూతి ఉందని అన్నారు.

వినడానికి ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ నిజం ఇదేనని, తనకు మోదీ అంటే ద్వేషం లేదని విద్యార్థులతో చెప్పారు. మోదీ వర్సెస్ రాహుల్ అంటూ పోల్చడం వంటి వాటితో ఎలాంటి ఉపయోగం ఉండదనేది తన అభిప్రాయమని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆదివారం డల్లాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో విద్యార్థులు, స్థానిక భారత సంతతి అమెరికన్లతో సమావేశమయ్యారు.

Related posts

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..

Ram Narayana

బీజేపీ నేత చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను: అరవింద్ కేజ్రీవాల్

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పెండింగ్ లోనే

Ram Narayana

Leave a Comment