Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఫిరాయింపు ఎమ్మెల్యేపై పై కూనంనేని తూటాలాంటి మాట …

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాపితంగా చర్చ జరుగుతుంది ..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంటుంది …అయితే ఇది అధికారంలో ఉన్న పార్టీకి ఒక రూల్ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మరో రూల్ లా మారింది ..నిజంగా హైకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గదే …అసలు రాజ్యంగంలో ఎన్నో సవరణలు చేసిన పార్లమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో నాన్చుతుంది ..ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు … దీనికి ఒక చట్టం తీసుకోని రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాల సందర్భాల్లో అన్నారు ..కానీ పార్లమెంట్ లో చర్చ జరగటంలేదు …గతంలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ , ఆ తర్వాత అనేక పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి…

తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారిని అనర్హులుగా ప్రకటించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ల పై ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై విచారణ జరిపిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది.

నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరి ల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ విధించిన హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తాం : కడియం శ్రీహరి అయితే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు వెలువరించిన తీర్పుపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హైకోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసిందని తానింకా పూర్తి జడ్జిమెంట్ ను చూడలేదని పేర్కొన్న ఆయన ఏది ఏమైనా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అవసరం అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తామన్నారు. పార్టీ పెద్దలతోనూ, న్యాయ నిపుణులతోనూ చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు వారే పార్టీ ఫిరాయింపులపై ఒక్కొక్క కోర్టు ఒక్కో తీర్పును ఇస్తున్నాయని పేర్కొన్న కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల పైన విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు బిఆర్ఎస్ నేతలే మూలకారకులని ఆయన మండిపడ్డారు.

పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బిఆర్ఎస్ ది హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకుంటున్న బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది అహంకారంతో విర్రవీగింది బిఆర్ఎస్ పార్టీ నే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Related posts

పవన్ కల్యాణ ఎవరు… ఎక్కడి నుంచి వస్తున్నాడు?: మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు

Ram Narayana

ఉదయం 11 గంటలకు కేటీఆర్ ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్

Ram Narayana

రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

Ram Narayana

Leave a Comment