Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జర్నలిస్టుల సంక్షేమం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఢిల్లీ జర్నలిస్టుల కృతజ్ఞతలు!

జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ, త్వరితగతిన అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం కలిశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు, అక్రిడిటేషన్‌ వంటి కీలక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రద్ధతో చొరవ తీసుకోవడం అభినందనీయమని మీడియా ప్రతినిధులు అన్నారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంతోపాటు తెలంగాణ మీడియా అకాడమీకి రూ.10 కోట్లు ప్రకటించడం జర్నలిస్టు సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… నిజమైన జర్నలిస్టుల సంక్షేమాన్ని పరిరక్షిస్తామని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, నిజమైన జర్నలిస్టులు వ్యవస్థలో భాగమేనని అన్నారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేసే వారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణాలో యమ తాగేస్తున్నారు …!

Ram Narayana

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: దామోదర రాజనర్సింహ

Ram Narayana

ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం ప్రజలు సంతోషంగా ఉంటారనుకోవడం లేదు: భట్టి విక్రమార్క

Ram Narayana

Leave a Comment