Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అరికెపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి… హరీశ్ రావు హౌస్ అరెస్ట్

  • సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్
  • అరికెపూడి ఇంటి వద్ద బీఆర్ఎస్ భేటీ ఉంటుందని ప్రకటించిన కౌశిక్ రెడ్డి
  • అరికెపూడి, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద పోలీసుల మోహరింపు

పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఈరోజు బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు… హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్‌పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

శంభీపూర్ రాజు నివాసం నుంచి ర్యాలీ

శంభీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరాలని నిర్ణయించారు. దీంతో గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులను మోహరించారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ…

Ram Narayana

అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం: జనగామలో అమిత్ షా

Ram Narayana

Leave a Comment