- రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షల రివార్డు ఇస్తానన్న సంజయ్ గైక్వాడ్
- మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యేలతో కలిసి ఫిర్యాదు చేసిన చామల కిరణ్
- సొంత మండల కేంద్రం శాలిగౌరారంలో ఫిర్యాదు
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షల రివార్డ్‌ను అందిస్తానని ప్రకటించారు. దీంతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శ్యాంబాబుతో కలిసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సొంత మండల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫిర్యాదుకు సంబంధించిన కాపీని పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోస్తే రివార్డ్ ఇస్తామన్న మహారాష్ట్ర బుల్దానా ఎమ్మెల్యే సంజయ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.