Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ధ్రువీ పటేల్‌కు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం!

  • న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు
  • అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి ధ్రువీ పటేల్ విజేత‌
  • బాలీవుడ్ నటి, యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆకాంక్షించిన అందాల రాణి

తాజాగా న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధ్రువీ పటేల్‌ దక్కించుకున్నారు. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల ఆమె హ‌ర్షం వ్యక్తం చేశారు. అలాగే తాను బాలీవుడ్ నటి అవ్వాలని, ఇంకా యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆకాంక్షించారు. 

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో కిరీటం బ‌హూక‌ర‌ణ‌ తర్వాత ధ్రువీ మాట్లాడుతూ… “మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ ని అందుకోవడాన్ని అపురూప గౌరవంగా భావిస్తున్నాను. కిరీటం కన్నా ఇది ఎక్కువ. ఇది నా విలువను, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించింది” అని ఆమె అన్నారు.   

ఇక ఇదే పోటీల్లో సురినామ్‌కు చెందిన లిసా అబ్దోయెల్‌హాక్ ఫ‌స్ట్‌ రన్నరప్‌గా, నెదర్లాండ్స్‌కు చెందిన మాళవిక శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

అలాగే మిసెస్ కేటగిరీలో ట్రినిడాడ్ కు చెందిన సుఅన్ మౌటెట్ విజేతగా నిలిచారు. స్నేహ నంబియార్ ప్రథమ, యూకేకు చెందిన పవన్‌దీప్ కౌర్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. 

టీన్ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. నెదర్లాండ్ నుంచి శ్రేయా సింగ్ ఫస్ట్ రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధా టెడ్జో రెండో రన్నరప్‌గా నిలిచారు.

ఈ అందాల పోటీలను న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహిస్తుంది. ఇండియన్-అమెరికన్‌లు నీలం, ధర్మాత్మ శరణ్‌ల‌ ఆధ్వ‌ర్యంలో పోటీలు జ‌రుగుతాయి.

Related posts

ప్రధానిగా కాదు.. ఓ హిందువుగా ఇక్కడకు వచ్చా.. బ్రిటన్ ప్రధాని వ్యాఖ్య

Ram Narayana

భారత్ ఎమర్జెన్సీ విమాన సర్వీసుకు మాల్దీవులలో అనుమతి నిరాకరణ.. 14 ఏళ్ల బాలుడు మృతి

Ram Narayana

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నాలుగు కేసుల నమోదు…!

Ram Narayana

Leave a Comment