Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మహిళలకు బతుకమ్మ చీరలకు బదులు రూ. 500..

తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అందించే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్న ట్టు తెలుస్తుంది

చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి, సర్కార్ ఈ సారి బతుకమ్మ పండగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా రూ. 500 ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలిం చాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం.

బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ. తెలం గాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టికీ నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

ఫ్రీ బస్సు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రూ. 2500 మహిళల ఖాతాల్లో జమ చేయడం వంటివాటి పై కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తోంది. అయితే మరో పది రోజుల్లో బతుకమ్మ పండగ మొదలుకానుంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 500 నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రూ. 500 లేదంటే ఆపైనా అందించేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవ డిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్

Related posts

తెలంగాణలో ఒక కుటుంబం గ్రామ బహిష్కరణ!

Ram Narayana

నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

మూసీనదిని థేమ్స్ నదిలా స్వచ్ఛంగా మారుస్తాం: లండన్‌లో రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment