తిరుపతి లడ్డు ప్రసాదంపై తమిళ యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలి …పొంగులేటి
ఛానల్ కు సంబందించిన గోపి సుధాకర్ పై కేసు నమోదు చేయాలి
ఏపీ పోలీసులు వెంటనే దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలి
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షపై కామెంట్ చేసిన నాన్ తమిళ కచ్చి టి మాన్ చర్యలు గర్హనీయం
రాజకీయపార్టీలు ఈ విషయంలో సంయనం పాటించాలి
తిరుపతి లడ్డు ప్రసాదంపై హాస్యభరిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు …తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రచారం జరుగుతున్న సందర్భంగా దానిపై హాస్యభరితంగా తమిళ యూట్యూబ్ ఛానల్ కు చెందిన గోపి సుధాకర్ ప్రసారం చేయడం పై ఆయన ఘాటుగా స్పందించారు …ఇలాంటి ప్రసారాలు భక్తుల మనోభావాలను గాయపరిచేవిగా ఉన్నాయని ఫైర్ అయ్యారు .. స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతుల కొవ్వుకు సంబందించిన నూనె ఉపయోగించారని దానిపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసిన సందర్భంలో ఇలా ప్రసారం చేసినందుకు ఆఛానల్ పైన దాని నిర్వాకుడు గోపి సుధాకర్ పై కేసు నమోదు చేయాలనీ అందుకు ఏపీ పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు …
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షపై నాన్ తమిళ కశ్చికి చెందిన టి .మాన్ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల , హిందువుల మనోభావాల్ని దెబ్బతిసేవిగా ఉన్నాయని ఒక సున్నితమైన సమస్యపై దాని పూర్వాపరాలు పరిశీలించి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని సుధాకర్ రెడ్డి అన్నారు .. ఇలాంటి తరుణంలో రాజకీయ పార్టీలు నాయకులు రెచ్చగొట్టే మాటలు ,వ్యాఖ్యానాలు గర్హనీయం , తప్పుడు సంకేతాలు ఇస్తాయని అన్నారు .విచారణ సంస్థకు సహకరించి అందులో నిజానిజాలు బయటకు వచ్చేలా సహకరించాలని అన్నారు …