Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: బాలరాజు

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: బాలరాజు

ఘట్ కేసర్ లో దరఖాస్తుల స్వీకరణ


అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తామని టియుడబ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాల్ రాజ్ తెలిపారు. గురువారం అన్నోజీగూడలోని ఎస్ బిఆర్ గార్డెన్ లో యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు వెల్లంకి జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఘట్ కేసర్, మేడిపల్లి జర్నలిస్టుల సమావేశంలో బాల్ రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల నుంచి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తుల స్వీకార ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నందున అవకాశం ఉన్నంత మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు లభించేలా తాము పాటు పడతామని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న ఇళ్ల పట్టాల విషయమై తమ కలలు సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఇళ్ల పట్టాలతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చించడానికి గాను త్వరలో ముఖ్యమంత్రితో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

టియుడబ్ల్యూజే (ఐజేయు) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇళ్ల పట్టాల కోసం తాము సేకరించిన దరఖాస్తులను ప్రెస్ అకాడమీ చైర్మన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని వారు తెలిపారు. గురువారం దరఖాస్తులు చేయలేని వారు ఈనెల 27 వ తేదీ నాటికి తమ దరఖాస్తు ఫారాలను అన్ని వివరాలతో తమ ప్రాంతాల్లోని జిల్లా కార్యవర్గ సభ్యులకు అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాల కోసం యూనియన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు ఒకవేళ ఏదైనా జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా ఉంటే వాటిని రద్దు చేసుకోవడం మంచిదని వారు సూచించారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) మేడ్చల్ జిల్లా సంయుక్త కార్యదర్శులు వి.గోవింద రాజ్, డి.రాజురెడ్డి, ఘట్ కేసర్, మేడిపల్లి ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు కె.నర్సింహ్మ, కె.ఎల్లయ్య, నర్సింహ్మరెడ్డి, ప్రధాన కార్యదర్శులు, రెండు మండలాల విలేకరులు పాల్గొన్నారు.

Related posts

రూ.175 కోట్లు కాజేశారు… హైదరాబాద్ లో భారీ సైబర్ చౌర్యం!

Ram Narayana

హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ శుభవార్త…

Ram Narayana

హైడ్రా పై సోషల్ మీడియాలో వ్యతిరేకత కనిపిస్తుందన్న కమిషనర్ రంగనాథ్

Ram Narayana

Leave a Comment