Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తులు!!

  • 10.71 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న గృహనిర్మాణ శాఖ అధికారులు
  • 7.50 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు వెల్లడి
  • వారం రోజుల్లో మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తామన్న అధికారులు

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 10.71 లక్షల దరఖాస్తులు వచ్చాయని గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు వరకు 7.50 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, వారం రోజుల్లో మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని వెల్లడించారు.

సర్వే పూర్తయ్యాక జీహెచ్ఎంసీలో వార్డు సభలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 2,249 మంది సిబ్బంది దరఖాస్తుల పరిశీలనలో పాల్గొంటున్నట్లు తెలిపారు. సర్వే సిబ్బంది వివరాలను https://indirammaindlu.telangana.gov.in/applicantSearch వెబ్ సైట్‌లో చూడవచ్చని తెలిపారు.

గతంలో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభల్లో కొత్తగా దరఖాస్తులు ఇవ్వవచ్చని తెలిపారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ లెక్కన జీహెచ్ఎంసీలో 24 నియోజకవర్గాలకు 84 వేల ఇళ్లు వస్తాయని తెలిపారు.

Related posts

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం!

Ram Narayana

హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఊపు తగ్గిందా? అంటే రంగనాథ్ సమాధానం ఇదీ…

Ram Narayana

పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిల్ దాఖలు!

Ram Narayana

Leave a Comment