Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మీ మంత్రుల ఫామ్ హౌస్‌లను ముందు కూలగొట్టు…కేటీఆర్

రాష్ట్రంలో హైడ్రాపేరుతో పేదల ఇళ్లను కూలగొట్టి వారిని రోదనలకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు …ముందు నీ మంత్రుల ఇళ్లను కూలగొట్టు ఆ తర్వాత మిగతావి అంతేకాని హైద్రాబాద్ ప్రజలు ఓట్లు వేయలేదని కక్ష తీర్చుకోవడం మంచిది కాదని ఇందుకు ఫలితం అనుభవించకతప్పదని హెచ్చరించారు …ఒక శాఖ పర్మిషన్ ఇస్తే మరొక శాఖ ఇళ్లను ఎలా కూలగొడుతుందని ప్రశ్నించారు …పేదోళ్ల ఉసురు తగులుతుంది …వారిని చావగొట్టి ఏమి చదిస్తావని అన్నారు .తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల లో పర్యటించిన కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలను తూర్పారబట్టారు …

ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేతికి తెలుస్తలేదన్నారు …వీళ్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో… సర్కస్ నడుపుతున్నారో తెలుస్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు …ప్రభుత్వమంటే ప్రజల మేలుకోసం మంచిపనులు చేసి వారి మన్ననలను పొందాలని కానీ ఈసర్కార్ చేస్తున్నదేమిటి కట్టినవాటిని కూలగొట్టడం అందులో పేదలకు ప్రత్యాన్మయం చూపించకుండా కూలగొట్టడాన్ని కేటీఆర్ తప్పు పట్టారు ..

ఒక శాఖ పర్మిషన్ ఇస్తే మరొక శాఖ ఇళ్లను కూలగొడుతుందా? పర్మిషన్ ఇచ్చి తర్వాత ఇళ్లు కూలగొడితే దానికి బాధ్యుడు ఎవడు? ఒక చిన్న పాప, ఒక గర్భిణీ మహిళ ఇళ్లు కూలగొట్టదని బతిమాలినా కనికరం చూపకపోవడాన్ని ఏమనాలని అన్నారు …నీ ప్రభుత్వం చేసిన తప్పుకు ఎవరు బాధ్యులు? నీ అన్న ఇళ్లు ముట్టనివ్వవు.. బడుగుల బతుకులు మాత్రం చిధ్రం కావాలి.
మీ అన్నకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేంత సమయం. పేదలను మాత్రం బుల్డోజర్లతో తొక్కేస్తావా? హైదరాబాద్‌లో ప్రజలు ఓట్లేయలేదని వాళ్లపై పగ తీర్చుకుంటమంటే ఊరుకోం..
హైదరాబాద్‌లో మేము కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూమ్‌లు వాళ్లకు ఇవ్వు..బాధితులకు ముందు మేము కట్టిన ఇళ్లను ఇవ్వు.. తర్వాత వాళ్లను కదిలించు లేకపోతె వారి పక్షాన బీఆర్ యస్ పోరాడుతుందని అన్నారు ..

Related posts

సేవకులం తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకున్నాం.. నెల రోజుల పాలనపై రేవంత్‌రెడ్డి

Ram Narayana

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కంగ్రెస్ దే హవా: న్యూస్ ఎక్స్ సర్వే

Ram Narayana

బీఆర్ఎస్‌కు కృష్ణయాదవ్ రాజీనామా, నాలుగైదు రోజుల్లో కీలక ప్రకటన!

Ram Narayana

Leave a Comment