Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు ..ఇది రాజకీయ కక్షే అంటున్న కాంగ్రెస్

తెలంగాణ రెవెన్యూ ,గృహనిర్మాణ ,సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. పట్టుమని పదినెలలు కాకుండానే రెండవసారి రెండవసారి ఆయన ఇళ్లపై బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరగడం గమనార్హం .స్వతహాగా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై దాడులు జరుగుతాయనే అనుమానాలు ఉన్న ఇంత తొందరగా జరుగుతాయని ఎవరు అనుకోలేదు …ఇది కక్ష సాధింపు అని కాంగ్రెస్ నేతలు అంటుండగా తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నామని ఈడీ అధికారులను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి . అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన నామినేషన్ వేసేరోజునే ఇన్ కం టాక్స్ అధికారులు దాడులు చేయడం పెద్ద హల్చల్ సృష్టించడం జరిగింది … ఇప్పుడు ఈడీ రైడ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది …కావాలనే కేంద్రం రాజకీయ కక్షతో దాడులు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ జరిగింది . ఏకకాలంలో అన్ని చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల పొంగులేటి నివాసంలోనేగాక, హిమాయత్ సాగర్ లోని ఆయన ఫాం హౌజ్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేగాక తన కుమార్తె ఇంట్లోనేగాక, బంధువుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఉదయం ఐదు, ఆరు గంటల నుంచే పొంగులేటి నివాసంలో, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు వేర్వేరుగా సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో, లగ్జరీ వాచ్‌ల కొనుగోలు కోసం క్రిప్టో, హావాలా మార్గంలో లావాదేవీలు జరిపారనే అభియోగంతో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి ఖరీదైన వాచ్‌లు తెప్పించారని, ఇందుకు సుంకం చెల్లించలేదని, చెన్నై కస్టమ్స్ అధికారులు అతని కుమారుడు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేశారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్‌లు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలోకం నవీన్‌ కుమార్ మధ్యవర్తిగా సింగపూర్‌కి చెందిన ఫహెర్దీన్ ముబీన్‌ నుంచి హర్షరెడ్డి వాచ్‌లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ గుర్తించింది. విచారణలో అలోకం నవీన్ కుమార్ రూ. 100 కోట్ల స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ఇటీవల చెన్నై కస్టమ్స్ అధికారులు హైదరాబాద్, ఖమ్మంలో సోదాలు చేసింది. ఈ వ్యవహారంపై మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది.
మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా నగరంలో మొత్తం 5 చోట్ల ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఉదయం 5గంటల నుంచి మంత్రి పొంగులేటి నివాసం, అతని ఫామ్‌హౌస్, జూబ్లీహిల్స్‌లోని కుమార్తె నివాసం, కార్యాలయాలు సహా మొత్తం 5 చోట్ల ఏక కాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది భద్రతతో సోదాలు కొనసాగుతున్నాయి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల లోపాయికారి ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ రైడ్స్ ఈ కుట్రలో భాగమేనని అన్నారు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 96 శాతం ప్రతిపక్షాల మీదనే దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి పొందడానికి ప్రతిపక్ష పార్టీల నేతలపై బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అక్రమ కేసులను మేం రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా గురించి మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతల వల్ల నష్టపోతున్న పేదలను ఆదుకుంటామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై హరీష్ రావు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Related posts

మేడిగడ్డ వద్ద మళ్లీ భారీ శబ్దాలు..!

Ram Narayana

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటం మాత్రమే చేసింది: మంత్రి పొంగులేటి

Ram Narayana

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

Ram Narayana

Leave a Comment