Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో డీఏల పెండింగ్ పై తీవ్ర అసంతృప్తి ఉంది ..ఏ నలుగురు కలిసిన ఇదే చర్చ …ఇంకెంతకాలం సాగదీస్తారని అడుగుతున్న ఉద్యోగులు ..2022 జులై నుంచి ఇవ్వాల్సింది …ఇప్పటికి 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి…వివిధ రకాల బిల్లులు చెల్లించడంలేదు ..సీసీఎస్ రద్దుపై ఇచ్చిన హామీలు ఉన్నాయి.పీఆర్సీ అమలుపై స్పష్టత లేదు …దసరా సందర్భంగా డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ,పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు …

అధికారంలోకి వచ్చిన వెంటనే కరువు భత్యం (డీఏ) చెల్లిస్తాం. ఆర్నెళ్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలు చేస్తాం. నెలరోజుల్లోనే వివిధ రకాల పెండింగ్‌ బిల్లులను మంజూరుచేస్తాం’అంటూ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. డిసెంబర్‌ ఏడో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నది. అది తప్ప మిగతా సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 2022, జులై నుంచి డీఏలు పెండింగ్‌లు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో మూడు, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెండు డీఏలు కలిపి మొత్తం ఐదు డీఏలు విడుదల చేయాల్సి ఉన్నది. ఇంకోవైపు పీఆర్సీ అమలుపై స్పష్టత కరువైంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది. దానిపైనా ఎలాంటి నిర్ణయం తీసు కోలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబం ధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు రూ.నాలుగు వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో అసంతృప్తి పెరిగే అవకాశమున్నది. ఇంకెంతకాలం డీఏల పెండింగ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేయాలంటూ కోరుతున్నారు.

మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటూ బీఆర్‌ఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించింది. 2022 జులై, 2023 జనవరి, జులైకి సంబంధించి మూడు డీఏలను చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2024 జనవరి, జులై రెండు డీఏలు బకాయిలున్నాయి. ఐదు డీఏలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేస్తామన్న హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇంకోవైపు బకాయిలు చెల్లించకపోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మరో రెండు డీఏలు విడుదల చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనీ, బీఆర్‌ఎస్‌ హయాంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం వల్ల తెలంగాణ దివాళా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాటలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు విన్నారు. తొమ్మిది నెలలు గడిచినా డీఏలు, వివిధ రకాల పెండింగ్‌ బిల్లులను విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి దోహదపడుతున్నది. అధికారం లోకి వచ్చిన ఆర్నెళ్లలోపు పీఆర్సీని అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు నివేదికను కూడా తెప్పించుకోలేదు. పదో పీఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఐఆర్‌ లేకుండానే 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చింది. గడువుకు ముందే పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ఐదు శాతం ఐఆర్‌ను ప్రకటించడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భగ్గుమ న్నారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీని అమలు చేయాలని కోరుతు న్నారు. సీపీఎస్‌ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏకీకృత పెన్షన్‌ పథకం (యూపీఎస్‌)ను అమలు చేస్తామని ప్రకటిం చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓపీఎస్‌ను అమలు చేస్తామని ఇంత వరకు ప్రకటించలేదు. దీంతో సీపీఎస్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 317 జీవో బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిం చింది. నివేదికను రూపొం దించలేదు. ఆ సమస్య ఎప్పుడు పరిష్కా రమవుతుందోనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.

పెండింగ్‌ డీఏలు వెంటనే విడుదల చేయాలి :

పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి. వాటి కోసం 2022, జులై నుంచి ఎదురుచూస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించాలి. ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీ నివేదికను తెప్పిం చుకుని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి. ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను పటిష్టంగా అమలు చేయాలి సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి. 317 జీవో బాధితుల సమస్యను పరిష్కరించాలి. దసరా వరకు వేచిచూస్తాం. ఆ తర్వాత ఉద్యోగ జేఏసీ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తుంది.

ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది

రాష్ట్రంలో పది లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాలున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయకుంటే వారిలో అసంతృప్తి పెరుగుతుంది. గత బీఆర్‌ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తేడా లేదని భావించాల్సి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను మంజూరు చేయాలి. ఏండ్ల తరబడి డీఏలు, బిల్లులు పెండింగ్‌లో ఉంచడం ప్రభుత్వానికి మంచిది కాదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగంలో, సమాజంలో ఉద్యోగులు కూడా భాగమే. వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టిసారించాలి. ఉద్యోగులను సంతృప్తిపర్చాల్సిన బాధ్యత ఉన్నది. డీఏలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత. రెండున్నర ఏండ్లుగా పెండింగ్‌లో ఉంచడం సరైంది కాదు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యోగ జేఏసీలో చర్చించి దసరా తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం.

Related posts

రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దు పాతవారికి యధాతధంగా వస్తాయి…సీఎం రేవంత్

Ram Narayana

రూ. 5 వేలతో పుష్పక్ జనరల్ బస్‌పాస్‌లు తెచ్చిన తెలంగాణ ఆర్టీసీ!

Ram Narayana

రోడ్డుపై వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు నుంచి ఎగసిపడ్డ మంటలు.. కారు దగ్ధం

Ram Narayana

Leave a Comment