- చెన్నై మెరీనా బీచ్ లో నేడు ఎయిర్ షో
- వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు
- విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట
చెన్నై నగరంలోని ప్రఖ్యాత మెరీనా బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ మెరీనా బీచ్ లో ఎయిర్ షో నిర్వహించగా, ఈ ప్రదర్శన తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకోగా, ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడగా, వారిని చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
రద్దీ ఎక్కువగా ఉండడం, వాతావరణంలో అధికవేడిమి, ఉక్కపోత కారణంగా సందర్శకుల్లో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.