Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

యుద్ధంతో ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న ఇజ్రాయిల్!

పాలస్తీనాపై ఏడాదిగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నదని వామపక్షాల నేతలు ఆరోపించారు. యుద్ధంతో వేలాది మంది ప్రాణాలు బలిగొంటుందని లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు . పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాత కలెక్టరేట్ ఎదురుగా గల చాకలి బలమ్మ విగ్రహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో వామపక్షాల నాయకులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద ముసుగులో ఇజ్రాయిల్ యుద్ధకాండ కొనసాగిస్తుందని, గాజాపై జరిపిన దాడుల్లో 50వేల మంది మరణించారని ఇందులో 75 శాతం వృద్ధులు, పిల్లలే ఉన్నారని వారు తెలిపారు. ఇజ్రాయిల్ పశ్చిమాసియా దేశాలపై యుద్ధానికి తెగబడుతుందని దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. అంతర్జాతీయ న్యాయ స్థానం ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా దాడులను ఇజ్రాయిల్ ఆపకపోవడం శోచనీయమన్నారు. చమురు సంస్థలపై ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుందని, ఇజ్రాయిల్ ముడి చమురుపై ఆధిపత్యం, అమెరికాకు ఆయుధాలు అమ్మకం జరగాలని ఈ రెండు దేశాలు కుట్ర ఫలితమే ఈ యుద్ధమని వామపక్ష నేతలు తెలిపారు. మారిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన నేపథ్యంలో యుద్ధాన్ని తక్షణం నిలిపివేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అలీన విధానానికి తిలోదకాలు ఇచ్చి సామ్రాజ్యవాద దేశాలకు పరోక్ష మద్దతునిస్తున్నారని, ఈ వైఖరిని నిరసించాలని వామపక్ష నేతలు పిలుపు నిచ్చారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధర పెరుగుతుందని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు తెలిపారు. యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ నినాదించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఎన్ది నాయకులు రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రసంగించగా యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జమ్ముల జితేందర్రెరెడ్డి, యర్రాబాబు, నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, గాదె లక్ష్మి నారాయణ, ఏనుగు గాంధీ, నూనె శశిధర్, బోడా వీరన్న, రవి, రామకృష్ణ, సిపిఎం నాయకులు వై. విక్రం, పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీను, కళ్యాణం వెంకటేశ్వరరావు, రవీంద్ర నాయక్, మాదినేని రమేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గెలిపించే భాద్యత మీది …పనిచేసే భాద్యత నాది …నామ

Ram Narayana

మంత్రి అజయ్ కుమార్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిప్పులు …

Ram Narayana

ఇంకా నిర్ణయంకాని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి …

Ram Narayana

Leave a Comment