Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరికలు …

ఈరోజు అంబటి వెంకటేశ్వర గారి నివాసంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు గారి సమక్షంలో అంబటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో అనంతసాగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నూతలపాటి వెంకటేశ్వర్లు గారు వారితోపాటు పలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ అట్టి అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉద్దేశంతోనే తాము కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామని అనంతసాగర్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్ గారు, చింతకాని మండల పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు గారు, అనంతసాగర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సింగారపు రవి తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు మడుపల్లి భాస్కర్, కూరపాటి కిషోర్, కొప్పుల గోవిందరావు, గ్రామ జోనల్ ఇన్చార్జీలు తూము కోటేశ్వర రావు, బందెల నాగార్జున్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపతి గోవిందరావు, మండల నాయకులు కొప్పుల గోవిందరావు, ఓర్సు వీరభద్రం, ఎస్కే అఫ్జల్, నాగులువంచ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కంభం వీరభద్రం, ఆలస్యం బసవయ్య, బత్తుల శ్యాంసుందర్, ఇటుకల లెనిన్, చల్లా అచ్చయ్య, జాన్ పాట్ ఆదినారాయణ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

SFI Former Students Meet Grand Success in Khammam…

Ram Narayana

రాయల చంద్రశేఖర్ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు …పలువురు నివాళులు

Ram Narayana

కమ్యూనిస్ట్ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం పోటు ప్రసాద్…పలువురు ప్రముఖుల నివాళు!

Ram Narayana

Leave a Comment