Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ ఓ శకం…మంత్రి పొంగులేటి

భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ టాటా ఓ శకం అని…. ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి కే కాకుండా ప్రపంచానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

Related posts

కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…

Ram Narayana

ఖమ్మంలో రసవత్తర రాజకీయం …తుమ్మల పువ్వాడ సై అంటే సై.. ఇంతకీ గెలుపెవరిది ..?

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతం

Ram Narayana

Leave a Comment