Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పండగపూట ఆత్మీయుల ఇళ్లకు అనుకోని అతిధి!

అసలే తన పలకరింపులు ద్వారా ప్రజలను ఇట్టే ఆకట్టుకునే మంత్రి పార్టీ నేతల ఇళ్లకు నేరుగా వెళ్లడం సంభ్రమాశ్చర్యాలకు చర్చనీయాంశంగా మారింది … పండగపూట అది విజయదశమి ,దసరా సందర్భంగా ఆత్మీయుల ఇళ్లకు అనుకోని అతిధిగా మంత్రి పొంగులేటి వెళ్లారు …ముందుగా చెప్పకుండా తన టూర్ ప్రోగ్రాంలో లేకపోయినా పార్టీ నేతల ఇళ్లకు సడన్ గా వెళ్లడంతో పార్టీ నేతలకే కాకుండా కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు …మంత్రి స్వయంగా వచ్చి వారిని పలకరించడం వారి బాగోగులు తెలుసుకోవడంతో వారు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు …మంత్రి వచ్చారని ఆయన స్వీట్లు , కాఫీ ఇచ్చేందుకు ఉత్సాహం చూపారు …మంత్రి పొంగులేటి తనదైన స్టయిల్ లో అమ్మా ఏమి వద్దురా .. కుదిరితే కప్పు కాఫీ అదిలేకపోతే మంచినీళ్లు ఇవ్వండి లేదా నాలుగు మాటలు… కుశల ప్రశ్నలు అంటూ కుటుంబ విషయాలు తెలుసుకోవడంతో వారు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు … ఇది పొంగులేటి స్టయిల్ అనుకున్నారు …అధికారం ఉన్న లేకపోయినా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల్లో తిరగడం అలవాటుగా పెట్టుకున్నారు …తాజాగా పార్టీ నేతల ఇళ్లకు వెళ్లడం ఆయనపై వారికున్న అభిమానాన్ని మరింత పెంచింది …

శనివారం రోజున దసరా సందర్భంగా మంత్రి పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు నాయకుల ఇళ్లకు ఆత్మీయ అతిథిగా వెళ్ళారు. కులాసా కబుర్లు చెబుతూ ఆయా నాయకుల ఇళ్ళ వద్ద కాసేపు కాలక్షేపం చేశారు. పండుగ వేళ అనుకోని అతిథిగా శీనన్న రావడంతో నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధులు లేవు. వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతి ఒక్కరినీ పలరిస్తూ మంత్రి పొంగులేటి వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ నాయకుడు జూపల్లి రమేష్ …. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆలపాటి రాము…. వైరా లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొర్రా రాజశేఖర్ …. ఖమ్మం రూరల్ మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధరావత్ రామ్మూర్తి నాయక్…. కూసుమంచి మండలంలో దండ్యాల లక్ష్మణ రావు ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు…

అంతకు ముందు దసరా పర్వదినం సందర్భంగా తన స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం లో తన తండ్రి పొంగులేటి రాఘవ రెడ్డి సమాధి (రాఘవ ఘాట్) వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Related posts

ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ హఠాన్మరణం….

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతం

Ram Narayana

వరద భాదిత జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు సహాయం!

Ram Narayana

Leave a Comment