మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుమారుని వివాహం ..హాజరైన కేటీఆర్ ,హరీష్ రావు
ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీలు తాతా మధు , రవీందర్ రావు
సండ్ర కుమారుడు భార్గవ్ పెళ్లి చిద్విత సాయితో హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య-మహాలక్మీల జేష్ఠ కుమారుడు భార్గవ్ పెళ్లి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కుర్రా అశోక్ -లక్మీల ఏకైక కూతురు చిద్విత సాయితో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. పెళ్లికి రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరై అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవానిలతో కలిసి నూతన వధూవరులు భార్గవ్-చిద్విత సాయిలకు శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్,నానబాల హరీష్ రావు తదితరులు నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు.సండ్ర వెంకట వీరయ్య-మహాలక్మీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.