- పశ్చిమాసియాలో మరింత తీవ్రతరం అవుతున్న యుద్ధం
- మరోసారి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
- 19 మంది మృతి, 80కి పైగా మందికి గాయాలు
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్‌లో ఓ పాఠశాలపై ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 19 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి.
గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ శరణార్థి శిబిరంగా మార్చినట్లు సమాచారం. అయితే దానిపైనే ఇజ్రాయెల్ ఇప్పుడు దాడి చేసింది.
రెస్క్యూ టీమ్ 19 మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అలాగే పిల్లలు, మహిళలు సహా 80 మంది గాయపడిన వారిని సెంట్రల్ గాజాలోని ఆసుపత్రులకు తరలించినట్లు పారామెడిక్స్ తెలిపారు.
అక్టోబరు 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడికి ప్రతీకారంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు దాదాపు 1,200 మంది చనిపోయారు. సుమారు 250 మంది బందీలు అయ్యారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడులలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 42,227కు చేరుకుందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.