రేపటి నుంచి మూసి పరివాహక ప్రాంతాల కూల్చివేతలు..!!
ఇప్పటికే 150 ఇల్లు కూల్చివేత …ఇంకా మరో 2166 నిర్మాణాలు
ఖాళీచేయించిన నిర్వాసితులను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలింపు
నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు
మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా..ఇంకా 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు.
దీంతో హైదరాబాదులోనే మూసి నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు.
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో గత పది రోజులుగా కూల్చివే తలకు బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం రేపటి నుంచి మళ్లీ పనులు మొదలు పెట్టనుంది. మూసీ సుందరీ కరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది.
ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఇళ్లకు ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేశారు. దాదాపు 150 ఇళ్లను సైతం కూల్చి వేశారు కూడా. అయితే ఇంకా నదీ గర్భంలో దాదాపు 2,166 నిర్మాణా లున్నట్లు అధికారులు తేల్చారు.
ఇప్పటికే నిర్వాసితులను ఆ ఇళ్ల నుంచి ఖాళీ చేయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తరలించారు. ఇంకా వెళ్లని వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించి.. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..రేపటి నుంచి కూల్చివేతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
రెండో దశలో నదీగర్భంలో ఇళ్లను కూల్చివేయడంతో పాటు బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు రెడ్ మార్క్ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.