- అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం దుర్ఘటన
- మృతుల్లో ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు
- రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం
అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు (యూఎస్ కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు.
ముగ్గురు తెలుగువారు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అక్కడి ప్రవాస భారతీయులు పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రవాస భారతీయ ప్రతినిధులు తెలిపారు.