Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల న్యూ జర్నీ బిగిన్స్ …గులాబీ దళంనుంచి కాషాయ వనంలోకి…

ఈటల న్యూ జర్నీ బిగిన్స్ …గులాబీ దళంనుంచి కాషాయ వనంలోకి
ఈటలను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్
బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్.. కాషాయ కండువా క‌ప్పిన కేంద్ర‌మంత్రి
బీజేపీ తీర్థం పుచ్చుకుని కొత్త ప్రయాణం మొదలైందన్న ఈటల
బీజేపీకి కృతజ్ఞతలు :తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతానని ప్రకటన
ఎప్పటికీ ప్రజాసేవకే అంకితమని ఉద్ఘాటన
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈట‌ల‌
ఏనుగు ర‌వీంద‌ర్ త‌దిత‌రులు కూడా చేరిక

ఈటల న్యూ జర్నీ బిగిన్స్ …గులాబీ దళంనుంచి కాషాయ వనంలోకి వెళ్లారు ….కొన్ని రోజుల క్రితం గులాబీ కండువా వదిలేసినా ఈటల కాషాయికండువా కప్పుకున్నారు ……అయితే ప్రచారం జరిగినట్లు పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాకుండా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో చేరడం గమనార్హం …… ఈటలకు ధర్మేంద్ర ప్రధాన్ కాషాయం కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ……బీజేపీలో చేరిన ఈటల బీజేపీ లో చేరికతో తన కొత్త జర్నీ ప్రారంభమైందని అన్నారు. తనను ఎంతో గౌరవించి బీజేపీ లో చేర్చుకున్నందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం ప్రజాసేవకే అంకితమని అన్నారు .

బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు పలువురు తెలంగాణ నేతలు బీజేపీ లో చేరారు … వారిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా , ఆర్టీసీ కార్మిక నేత అశ్వథామ రెడ్డి ముఖ్యనేతలు ఉన్నారు.

బీజేపీలో చేరిన అనంతరం ఈటల మాట్లాడుతూ, ఇవాళ తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టానని చెప్పారు. తమ పరివారంలో తనకు కూడా స్థానం కల్పిస్తూ, పార్టీలో చేరికకు స్వాగతించిన బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రజలు, పార్టీ కోసమే శ్రమిస్తానని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, తెలంగాణ‌ ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి త‌దిత‌రులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

కాగా ఉదయం 5 గంటలకే శామీర్ పేట్‌లోని త‌న‌ నివాసం నుంచి ఈట‌ల‌ బయలుదేరారు. 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీలో ప‌లువురు బీజేపీ కీల‌క నేత‌ల‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. రేపు ఈట‌ల తిరిగి హైద‌రాబాద్ రానున్నారు.

 

ఈటల బీజేపీ లో చేరిన అనంతరం బండి సంజయ్ కామెంట్స్ …

-నియంతృత్వ పాల‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యం

-కాషాయ జెండా ప‌ట్టుకుని ముందుకు సాగాల‌ని ఆకాంక్ష‌
-గడీల పాలన’ను బద్దలు కొట్టాల‌ని నిర్ణ‌యం

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరిన నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ‘బీజేపీపై విశ్వాసంతో ఈట‌ల రాజేంద‌ర్ ఈ రోజు పార్టీలో చేరారు. నియంతృత్వ పాల‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని గొప్ప నిర్ణ‌యం తీసుకుని, కాషాయ జెండా ప‌ట్టుకుని ముందుకు సాగాల‌ని, తెలంగాణలో ‘గడీల పాలన’ను బద్దలు కొట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు’ అని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.

‘బీజేపీ త‌ర‌ఫున స్వాగతం ప‌లుకుతున్నాం. తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం బీజేపీ అండ‌గా ఉంటుంది. కేసీఆర్‌ను ఎదుర్కొనే ద‌మ్ము, ధైర్యం ఉన్న‌ పార్టీ బీజేపీ అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. బీజేపీ ఉద్య‌మంలో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని కోరుతున్నాం. ప్ర‌ధాని మోదీ పాల‌న‌లో ప్ర‌పంచంలో భార‌త్ శ‌క్తిమంతంగా త‌యార‌వుతోంది. న‌డ్డా నేతృత్వంలో బీజేపీ మ‌రింత శ‌క్తిమంతం అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డం సంతోషక‌రం’ అని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.

 

Related posts

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు: తమ్మినేని వీరభద్రం!

Drukpadam

రేషన్ డిపో వద్ద కనిపించని ప్రధాని ఫొటో.. కేంద్ర మంత్రి నిర్మల ఆగ్రహం!

Drukpadam

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కరుణాకర్ రెడ్డి…

Drukpadam

Leave a Comment