Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాదులోని ఓ పబ్ పై పోలీసులు దాడులు…!

  • పబ్ ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలు 
  • పబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు
  • 42 మంది మహిళలతో సహా 140మందిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఓ పబ్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 42 మంది మహిళలతో సహా 140 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. అశ్లీల నృత్య ప్రదర్శనలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై ఆకస్మికంగా దాడులు చేశారు. 

నిబంధనలకు విరుద్దంగా యువతులతో నిర్వాహకులు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  42 మంది మహిళలతో సహా 140 మందిని అరెస్టు చేశారు. పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్‌లను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకులను ప్రలోభపెట్టి వారి నుండి లాభాలు   ఆర్జించేందుకు నిర్వాహకులు వివిధ రాష్ట్రాల నుండి మహిళలను పబ్‌కు రప్పించినట్లు పోలీసులు తెలిపారు. పబ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts

చెరువుల పునరుజ్జీవం కోసం హైడ్రా చర్యలు తీసుకుంటోంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్

Ram Narayana

హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత.. 50 కోట్ల రైడర్‌షిప్ దాటేసి సరికొత్త రికార్డు…

Ram Narayana

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం…

Ram Narayana

Leave a Comment