Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్ అభివృద్ధిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు: భట్టివిక్రమార్క…

  • అందుకే విషప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • మూసీ నిర్వాసితులకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడి
  • నిర్వాసితులకు టవర్లు నిర్మించి, అందుబాటులో ఉంచుతామన్న భట్టివిక్రమార్క

హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, అందుకే విషప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందన్నారు.

నిర్వాసితులకు అద్భుతమైన టవర్స్ నిర్మించి అందులో ఉంచుతామని, వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. బాధిత డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు.

ప్రాపర్టీ షోను సందర్శించిన భట్టివిక్రమార్క

నరెడ్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను భట్టివిక్రమార్క సందర్శించారు. రియాల్టీ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బ్యాంకర్లతో చర్చించి రుణం అందేలా చూస్తామన్నారు. హైడ్రాపై ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్కులు, చెరువులు, గుట్టలను రక్షించేందుకే హైడ్రా అని స్పష్టం చేశారు.

Related posts

కూల్చివేతల ఖర్చు మొత్తం మీదే.. అక్రమ నిర్మాణదారులకు హైడ్రా స్పష్టీకరణ!

Ram Narayana

హుస్సేన్ సాగర్ లో గరిష్ఠ స్థాయికి చేరిన నీటిమట్టం.. లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక

Ram Narayana

చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ… మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు…

Ram Narayana

Leave a Comment