Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. 12 మంది మృతి…

  • టెంపోను ఢీకొన్న స్లీపర్ బస్సు
  • తొమ్మిది మంది చిన్నారుల సహా 12 మంది మృతి
  • రాజస్థాన్ రాష్ట్రం ధోల్‌పుల్లాలో ఘటన

రాజస్థాన్‌లోని ధోల్‌పుర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరికి గాయాలు అయాయి. టెంపోను స్లీపర్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బారీ నగరంలోని కరీం కాలనీ గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి బరౌలీ గ్రామంలో ఓ కార్యక్రమానికి నిన్న వెళ్లారు. కార్యక్రమం అనంతరం టెంపోలో రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు.

సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 12 మంది మృతి చెందగా, ఇందులో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నట్లు తెలిపారు. 

కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఏడీఎఫ్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దుర్గాప్రసాద్ మీనా, సర్కిల్ ఆఫీసర్ మహేంద్ర  కుమార్ మీనా తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Related posts

నాగ్ పూర్ సోలార్ కంపెనీలో పేలుడు.. 9 మంది దుర్మరణం

Ram Narayana

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం!

Ram Narayana

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన

Ram Narayana

Leave a Comment