Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన… హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత…

  • తెలంగాణలో అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్
  • జీవో 29 రద్దు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు
  • తీర్పు వచ్చే వరకు మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.29 రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వచ్చే వరకు గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

అయితే, ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుండగా, గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాదులో అశోక్ నగర్ లో ఇప్పటికే ఆందోళన కూడా చేపట్టారు. వారికి బండి సంజయ్, హరీశ్ రావు వంటి విపక్ష నేతలు కూడా మద్దతు పలికారు. 

తాజాగా, అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు.

Related posts

హైద‌రాబాద్‌లో గ‌లీజ్ దందా.. చికెన్ ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌!

Ram Narayana

హైదరాబాద్ నగర మేయర్ పై కేసు నమోదు!

Ram Narayana

శంషాబాద్‌‌కు ప్రతిపాదిత మెట్రోలైన్‌తో సరికొత్త అనుభూతి.. ఈసారి భూగర్భంలో!

Ram Narayana

Leave a Comment