Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఈ నెల 23న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు…

  • నేడు మల్లికార్జున ఖర్గేతో ప్రియాంక గాంధీ భేటీ
  • నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న ఖర్గే, సోనియా, రాహుల్, పార్టీ నేతలు
  • కల్పేట బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక ర్యాలీ

ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ ఈ నెల 23న వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేసి గెలిచారు. వయనాడ్ లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వయనాడ్ లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది.

ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికే చెందిన ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నెల 23న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రియాంక గాంధీ ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.

ప్రియాంక గాంధీ నామినేషన్‌కు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. అంతకంటే ముందు ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్‌ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ రోడ్డు షో నిర్వహిస్తారు.

Related posts

వయనాడ్ లేదా రాయ్‌బరేలీ… తేల్చుకోలేకపోతున్నానన్న రాహుల్ గాంధీ…

Ram Narayana

తనపై పోటీ చేస్తున్న బీజేపీ నేత కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే… ఇదిగో వీడియో

Ram Narayana

గాంధీనగర్ నుంచి అమిత్ షా ఘన విజయం…

Ram Narayana

Leave a Comment