Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వినోబా కాలనీ వాసులకు గృహవసతి కల్పించండి …మాది న్యాయమైన పోరాటం

వినోబా నవోదయ కాలనీ పేదప్రజల నివాసాలపై పోలీసులు అధికారులు పాశవిక దౌర్జన్యాలకు , బలవంతంగా ఇండ్లలో సోదాలు చేయడంలాంటి చర్యలు , బెదిరించి కేసులు నమోదు చేయడం పోలీసులు చేస్తున్న ఈ పాశవిక దమనకాండలో పేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని, అనైతికంగా అనుసరించిన విధానం పోలీసుల ప్రవర్తనకు అద్దం పడుతుందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ నేతలు ఆరోపించారు . వెలుగుమట్లలో సుమారు 62 ఎకరాల 7గుంటల భూదానభూమి వుంది . ఈ భూములపై గత 11 సంవత్సరాలుగా పేదలు హక్కులు సంపాదించుకుని ఇండ్లు నిర్మించుకోని వాటికి ఇంటి నెంబర్లు మరియు కరెంట్ మీటర్లు ఇవ్వాలని , ఇచ్చిన ఇంటి నెంబర్లను నిలుపుదల కొనసాగిస్తూ ఇంకా ఇతర సదుపాయాల కొరకు పజలు పోరాటం చేస్తున్నారు అని అన్నారు . ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చుకున్నా , ధర్నాలు చేసినా చివరకు హైకోర్టు వారి నుండి మంచినీరు , కరెంట్ ఇవ్వమని ఉన్న ఉత్తర్వులను అమలు చేయాల్సింది పక్కనపెట్టి , పేదప్రజలకు న్యాయమైన ఈ సమస్యను పరిష్కరించటంలో కలెక్టర్ , స్థానిక రెవెన్యూ , కరెంట్ , మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా విఫలమైనారు . పేద ప్రజలకు అరు గ్యారంటీలు అమలు చేసి ఇస్తామని అనునిత్యం ప్రచారం చేసుకుంటుంది . వినోబా నవోదయ కాలనీ ప్రజలకు వచ్చిన హై కోర్టు ఉత్తర్వులను అమలు చేయని ప్రభుత్వం అధికారులు చివరికి ప్రజలే స్వయంగా హక్కులు సంపాదించుకుని ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుండగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సెషన్ కోర్టులో “ఎక్పార్టీ డిక్రీ”నీ చూపిస్తూ నిరాధారమైన పిర్యాదును ఆధారం చేసుకొని నిర్దాక్షిణ్యంగా ఇళ్లను జేసిబిలతో ధ్వంసం చేయడం , ప్రజలపై కేసులు పెట్టి , ఇలాంటి క్రూరమైన దౌర్జన్యాలు చేసి పేదలను అక్రమంగా అరెస్టులు చేయడంలాంటి పాశవిక విధానాలకు పోలీసు వ్యవస్థ పాల్పడుతుందని , ఇదంతా అధికారపార్టీ అనుచరుల కనుసన్నలలో జరగుతుందని , పాలకపార్టీ అనుచరులకు ఈ భూముల విషయంలో ప్రయోజనం కల్గించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం , అధికారులు బరితెగించి పోలీసులతో కలిసి పేదలపై ఈ దౌర్జన్యకాండకు పాల్పడటం హేయమైన చర్యలని దీనిని ఒపీడీర్ ఉమ్మడి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా దండ లింగయ్య విహరించగా ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జితిన్ కుమార్ , జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పడిగి యర్రయ్య , ఓపిడిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.విజయేందర్ రావు , ఎఫ్ఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ ఎస్ ఎన్ మూర్తి , విజయ సారధి అడ్వకేట్ (హైదరాబాద్) , ఆంధ్ర ప్రదేశ్ జిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. వెంకటేశ్వరరావు , ఓపిడిఆర్ రాష్ట్ర కార్యవర్గ తెలంగాణ సభ్యులు సుంకర రమేష్ బాబు , ఓపిడిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాణాల లక్ష్మణ చారి , ఖమ్మం అడ్వకేట్ వెంకటలక్ష్మి , టిఆర్టిఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కిరణ్ జ్యోతి , ఓపిడిర్ నిజా నిద్దరణ కమిటీ సభ్యులు పద్మ , జిపిఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు ఎం.వీరస్వామి , ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యులు వై.సురేందర్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

ఖమ్మం ఎంపీగా కలెక్టర్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న రామసహాయం ..

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయానికి జోర్దార్ గా సమావేశాలు…

Ram Narayana

పండగపూట ఆత్మీయుల ఇళ్లకు అనుకోని అతిధి!

Ram Narayana

Leave a Comment